కొత్త పంచాయితీలు హరితహారంలో ముందుండాలి: ఎమ్మెల్యే

కొత్తగూడెం,జూన్‌26(జ‌నం సాక్షి): తండాలను అభివృద్ది చేసి పంచాయితీలుగా ప్రకటించడంతో నియోజక వర్గంలో గతంలో 32 పంచాయతీలుండ గా, ప్రస్తుతం 106పంచాయతీలు అయ్యాయని కొత్తగూడెం ఎమ్మెల్యే జలగం వెంకటరావు అన్నారు. ఈ పంచాయితీల్లోని ప్రజలంతా నాల్గో విడత హరితహారం కార్యక్రమం విజయవంతం చేసేందుకు సిబ్బంది కృషి చేయాలనీ, గ్రామస్థాయిలో ప్రణాళిక రూపొందించు కొని సుమారు 40వే ల మొక్కలు నాటాలన్నారు. గ్రామస్థాయిలోనూ నర్సరీలు రాబోతున్నాయని, ఉద్యానవనశాఖతో సంప్రదించాలని సూచించారు. కొత్త పంచాయితీలో ప్రజలు హరితహారంలో పెద్ద ఎత్తున పాల్గొని మొక్కలు నాటడడం ద్వారా ప్రత్యేకతను సాధించాలని ఎమ్మెల్యే సూచించారు. గ్రామ సమస్యలను కూడా గుర్తించి ప్రభుత్వం దృష్టికి తేవాల్సిన అవసరముందని పేర్కొన్నారు. ఒక వేళ గ్రామ స్థాయిలో పరిష్కారం కానీ పక్షంలో ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు. వర్షాకాలం అయినందున లోతట్టు ప్రాంతాల్లో నీరు నిల్వున్న చోట గంబూషియా చేపలను విడిచేందుకు మత్స్యశాఖను సంప్రదించా లన్నారు. లోతట్టు ప్రాంతాల సమస్యలపై ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ఉపాధి కూలీలు పనులను ఎందుకు వినియోగించుకోవడం లేదో విశ్లేషించుకోవాల్సిన అవసరముందన్నారు. మిషన్‌ భగీరథ పనులు పూర్తి కాగానే కాలువల పనులు ఉపాధి హావిూ కింద చేపడుతూ, ఇంకుడు గుంతల నిర్మాణం కోసం ప్రజలను ప్రోత్సహిస్తామని, ప్రజా చైతన్య కార్యక్రమాలను ఎప్పటికప్పుడు రూపకల్పన చేస్తూ ప్రణాళికాబద్దంగా ముందుకుపోతున్నామని వివరించారు.