కొత్త పంచాయితీ చట్టంతో మేలు: ఎమ్మెల్యే

కొత్తగూడెం,మే28(జ‌నం సాక్షి): పంచాయతీలకు అపరిమితమైన అధికారాలు నిబంధనలు రాబోతున్నాయని పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు తెలిపారు. కొత్తగా నిబంధలు వచ్చే ఎన్నికల అనంతరం అమలు అవుతాయని తెలిపారు. ప్రభుత్వం ప్రధాన లక్ష్యం గ్రామాల అభివృద్ధి అన్నారు. అది జరిగేలా అన్నీ చర్యలు తీసుకొంటున్నట్లు తెలిపారు. గత ప్రభుత్వాల మాదిరిగా కాకుండా పంచాయతీలకు కొత్తగా వచ్చే అధికారాలతో మంచి జరుగుతుందన్నారు. త్వరగా రైతుబంధు చెక్కులు పాస్‌ పుస్తకాలు పూర్తవ్వాలని అందుకు ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలని కోరారు. బీమా విషయం అందరికీ తెలిసేలా చెప్పాలని  కోరారు. మిషన్‌ భగీరథ పనుల విషయంలో స్థానిక ప్రజా ప్రతినిధులు శ్రద్ధ తీసుకోవాలని కోరారు. పోడు రైతులకు సైతం రైతుబంధు పథకాన్ని వర్తింపజేసిన ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్‌ అని, రాష్ట్ర ప్రభుత్వ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని  పేర్కొన్నారు. రాష్ట్రంలో వ్యవసాయరంగ అభివృద్ధి కోసం ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు దేశ వ్యాప్తంగా ప్రశంసలు పొందుతున్నాయన్నారు. పినపాక నియోజకవర్గంలో 5041 మంది పోడు రైతులకు రూ.9 కోట్ల విలువైన చెక్కులను రైతులకు అందజేశామని తెలిపారు. రైతుల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతున్న సీఎం కేసీఆర్‌ని రైతుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారని కొనియాడారు.