కొత్త రైల్వే లైన్లు ఇవ్వండి
ఏపీ ఎక్స్‌ప్రెస్‌కు పేరు మార్చండి
వ్యాగన్ల పరిశ్రమ ఏర్పాటు చేయండి
రైల్వే మంత్రితో సీఎం కేసీఆర్
హైదరాబాద్,జనవరి19(జనంసాక్షి): పెండింగ్‌లో ఉన్న రైల్వే లైన్లను పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని కేంద్ర రైల్వే మంత్రి సురేష్ ప్రభును సీఎం కోరారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌తో కేంద్ర రైల్వే మంత్రి సురేశ్‌ప్రభు సమావేశమయ్యారు. సమావేశంలో సీఎం కేసీఆర్ తెలంగాణలో రౖౖెల్వే కోచ్ ఫ్యాక్టరీ, వ్యాగన్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలని కేంద్ర రైల్వే మంత్రికి విజ్ఞప్తి చేశారు. కాజీపేట రైల్వే డివిజన్ ఏర్పాటు చేయాలని సీఎం విన్నవించారు. ఏపీ ఎక్స్‌ప్రెస్ పేరును తెలంగాణ ఎక్స్‌ప్రెస్‌గా మార్చాలని కోరారు. అలాగే వచ్చే బడ్జెట్‌లో కేటాయించాల్సిందిగా పలు ప్రతిపాదనలు చేశారు. ఇక హైదరాబాద్ పర్యటన సందర్భంగా.. ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా రైల్వేలను మరింత ఆధునీకరించాలని కేంద్ర రైల్వే శాఖ మంత్రి సురేష్ ప్రభు అభిప్రాయపడ్డారు. అందుకే భారత రైల్వేలను ప్రైవేటీకరించాలని అనుకోవడం లేదని అన్నారు. ప్రమాదాలు లేకుండా చూడడం,సదుపాయాలు పెంచడం , ప్రపంచ స్థాయిలో రైల్వేశాఖను అబివృద్ది చేయడం తమ ముందుఉన్న లక్ష్యాలని సురేష్ ప్రభు చెప్పారు.ప్రైవేటీకరణ పై వస్తున్న వదంతులను నమ్మవద్దని ఆయన చెప్పారు. రెండు కొత్త రైళ్లను సురేశ్ ప్రభు ప్రారంభించారు. సికింద్రాబాద్-విశాఖపట్నం, నాందేడ్-ఔరంగాబాద్ మధ్య ఈ కొత్త రైళ్లు నడవనున్నాయి. త్వరలోనే తిరుపతి – షిర్డీ మధ్య కొత్త రైలు ప్రారంభిస్తామని మంత్రి ప్రకటించారు. తెలంగాణ, ఆంధప్రదేశ్ రాష్టాల్ల్రో పెండింగ్ ప్రాజెక్టులను పరిష్కరిస్తామని పేర్కొన్నారు. ఇరు రాష్టాల్ల్రో రైల్వేలైన్లు పెంచాల్సిన అవసరం ఉందని సురేశ్‌ప్రభు అభిప్రాయపడ్డారు. ఆయన సిఎం కెసిఆర్‌ను కలిసి పలు అంశాలపై చర్చించారు.