కొనసాగిని స్టీల్ ప్లాంట్ ఆందోళనలు
విశాఖపట్టణం,ఆగస్టు17(జనంసాక్షి): స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. స్టీల్ ప్లాంట్ పరిరక్షణ పోరాట కమిటీ ఆధ్వర్యంలో ఆడ్మిన్ ముట్టడికి ప్రయత్నించారు. స్టాప్ ప్రైవేటైజేషన్ ఆఫ్ స్టీల్ ప్లాంట్ లోగోతో ప్రత్యేక గొడుగులతో వినూత్న నిరసనలకు దిగారు. అడ్మిన్ ఆఫీసులోకి ఉద్యోగులు వెళ్లకుండా రోడ్డుపై వాహనాలను నిలిపివేశారు. మోదీ హఠావో.. స్టీల్ ప్లాంట్ బచావో అంటూ నినాదాలు చేశారు.