కొనుగోలు కేంద్రాల్లోనే అమ్ముకోవాలి

జనగామ,అక్టోబర్‌30(జ‌నంసాక్షి): మద్దతుధర కల్పించేందుకే ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తు న్నట్లు జనగామ మార్కెట్‌ అధికారులు అన్నారు. తంలో కంటే రైతులకు ప్రభుత్వం మేలు చేసే విధంగా ఐకేపీ కేంద్రాలను ఏర్పాటు చేసి రైతులు పండించిన ధాన్యంకు గిట్టుబాటు ధర కల్పిస్తున్నారని తెలిపారు. అదేవిధంగా సీసీఐ కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడంఅభినందనీయమని తెలిపారు.

పత్తి రైతులు పత్తిని ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో అమ్ముకోవాలని, తేమలేకుండా తీసుకువస్తే మద్దతుధర వస్తుందని తెలిపారు. ప్రతీ పల్లెలోని చెరువుకు గోదావరి జలాలు అందుతుండడంతో పంట దిగుబడులు పెరుగుతున్నాయని చెప్పారు. ఇదిలావుంటే చుట్టు పక్కల గ్రామాల రైతులకు అందుబాటులో ఉండేవిధంగా ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రం, సీసీఐ కేంద్రాలను ఏర్పాటు చేసారు. ప్రజలకు అందుబాటులో ఏర్పాటు చేసినైట్లెతే మరింత రైతులకు ఉపయోగకరంగా ఉంటుందన్నారు.