కొలంబియాలో కూలిన విమానం
కొలంబియాలో విమానం కుప్ప కూలింది. బ్రెజిల్ నుంచి ఫుట్‌బాల్ క్రీడాకారులకు తీసుకెళ్తుండగా ప్రమాదం జరిగింది. కొలంబియాలో కూలిన విమానంలో ఉన్న ప్రయాణికులంతా మృతి చెంది ఉంటారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బ్రెజిల్ ఫుట్‌బాల్ క్రీడాకారులతో కలిసి విమానంలో 72 మంది ప్రయాణికులు ఉన్నారని అధికారులు తెలిపారు. ప్రమాద సమయంలో విమానంలో మొత్తం 81మంది ఉన్నట్లు సమాచారం. 72 ప్రయాణికులు, మిగితా వారు విమాన సిబ్బంది ఉన్నారు. 15,500 అడుగుల ఎత్తులో ఉండగా రాడార్ నుంచి విమానానికి సంబంధాలు తెగిపోయానని…సమీపంలోనే విమానం కూలిపోయినట్లు బొలివియా అధికారులు చెబుతున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.