కొలంబియాలో భారీ భూకంపం
బోగోట: కొలంబియాలో భారీ భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 7.1గా నమోదైంది. దక్షిణ కొలంబియాలోని ప్రాంతీయ రాజధాని పోపయాస్‌కు 30 కిలోమీటర్ల దూరంలో ఆదివారం అర్థరాత్రి దాటిన తర్వాత భారీ ప్రకంపనలు చోటుచేసుకున్నట్లు అక్కడి అధికారులు వెల్లడించారు. భూమి అడుగున 150 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు యూఎస్ జియలాజికల్ సర్వే సంస్థ తెలిపింది. అయితే ఆస్తి, ప్రాణ నష్టానికి సంబంధించిన వివరాలు తెలియరాలేదు.