కొలంబోలో కేటీఆర్‌ బిజీబిజీ

5

కొలంబో,ఆగస్టు 11(జనంసాక్షి):తెలంగాణ ఐటీ శాఖామంత్రి కేటీఆర్‌విదేశీ పర్యటన కొనసాగుతోంది. గురువారం ఆయన శ్రీలంక రాజధాని నగరం కొలంబోలో పలువురు ప్రముఖులతో వరుస భేటీలు నిర్వహించారు. తొలుత శ్రీలంకలో భారత హై కమిషనర్‌ వైకే సిన్హతో సమావేశమై ఇరు దేశాల మధ్య వ్యాపార, వాణిజ్య సంబంధాల పెంపుపై చర్చించారు. కొలంబో- హైదరాబాద్‌ విమాన సౌకర్యం పైనా ఆయనతో ప్రస్తావించారు. దీంతో ఆయన తెలంగాణలో శ్రీలంక పెట్టుబడులకు భారత్‌ కమిషనర్‌ హావిూ ఇచ్చారు. జాన్‌కీల్స్‌ కంపెనీ ప్రతినిధులతోనూ కేటీఆర్‌ భేటీ అయ్యారు. తెలంగాణలో ఫుడ్‌ ప్రాసెసింగ్‌, లాజిస్టిక్స్‌ రంగంలో పెట్టుబడులకు వారు సంసిద్ధత వ్యక్తంచేశారు. మలేషియాలోని పేర్‌ రాష్ట్ర సీఎంతో కొలంబోలో కేటీఆర్‌ సమావేశమయ్యారు. పలు వ్యాపార ఒప్పందాలకు సంబంధించి ఇరువురిమధ్య చర్చలు జరిగాయి.