కొల్లాపూర్‌ను రెవెన్యూ డివిజన్‌ చేస్తాం

 

– కొల్లాపూర్‌ సభలో ఆపద్ధర్మ సీఎం కేసీఆర్‌

నాగర్‌ కర్నూల్‌, నవంబర్‌27(జ‌నంసాక్షి) : కొల్లాపూర్‌ ను రెవెన్యూ డివిజన్‌ చేస్తామని ఆపద్ధర్మ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌ రావు హావిూనిచ్చారు. కొల్లాపూర్‌ నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన టీ ఆర్‌ ఎస్‌ ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్‌ పాల్గొని ప్రసంగించారు. కొల్లాపూర్‌ రాష్ట్రం సరిహద్దు కాబట్టి ఇక్కడ పాలిటెక్నిక్‌ కాలేజీని మంజూరు చేస్తామని హావిూ ఇచ్చారు. ఉమ్మడి మహబూబ్‌ నగర్‌ జిల్లాలో 1300 నుంచి 1400 వందల చెరువులు నింపుకొని పంటలు పండిస్తున్నామని అన్నారు. సింగోటం రిజర్వాయర్‌ నుంచి గోపాల్‌ కు కాల్వ తవ్వాలని చెప్పారు. మళ్లీ విూ దయతో ప్రభుత్వం ఏర్పడిన తెల్లారే కాల్వ పనులు మొదలుపెడుతామన్నారు. సంవత్సరంలోపే కాల్వ పనులు పూర్తి చేసి.. 40 వేల ఎకరాలకు నీళ్లిస్తామని కేసీఆర్‌ హావిూ ఇచ్చారు. రైతుబంధు, రైతుబీమా పథకాలు రైతుల్లో ఆత్మస్థెర్యాన్ని నింపాయన్నారు. టీఆర్‌

ఎస్‌ ప్రభుత్వం రైతు పక్షపాతిగా ఉంటుందని, కేసీఆర్‌ బతికున్నంత వరకు 24గంటల ఉచిత కరెంట్‌ ఇస్తాన్నారు. పండే పంటలకు గిట్టుబాటు ధర కల్పించేందుకు ఐకేపీలో పని చేసే ఉద్యోగులను పర్మినెంట్‌ చేసి ఆహార శుద్ధి కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలు చేసేలా చర్యలు తీసుకుంటామని కేసీఆర్‌ స్పష్టం చేశారు. జూపల్లి కృష్ణారావు స్వార్థం లేని నాయకుడని కేసీఆర్‌ అన్నారు. ఉద్యమ సమయంలో మంత్రి పదవిని వదిలేసి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారన్నారు. అనంతరం తెలంగాణ ఉద్యమంలో చేరారని, ఆ సమయంలో ఉప ఎన్నిక జరిగితే విూరే దీవించి మళ్లీ గెలిపించారని, 2014లో మళ్లీ దీవించి గెలిపించారని, జూపల్లికి సముచిత స్థానం ఇచ్చానన్నారు. రాబోయే రోజుల్లో కూడా ఆయనకు సముచిత స్థానం ఇస్తామని కేసీఆర్‌ తెలిపారు.