కోటగిరి తహసీల్దార్ కార్యాలయాన్ని దిగ్బందనం చేసిన వీఅర్ఎలు
కోటగిరి అక్టోబర్ 10 జనం సాక్షి:-రాష్ట్ర జేఏసి కమిటీ పిలుపు మేరకు సోమవారం రోజున కోటగిరి మండల విఅర్ఎలు మండల తహసిల్దార్ కార్యాలయాన్ని దిగ్బందనం చేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.రాష్ట్ర వ్యాప్తంగా 23 వేల మంది వి.అర్.ఎ లు తమ విధులను బహిష్కరించి నేటికీ 78 వ రోజుకు చేరుకుంది.
అసెంబ్లీ సాక్షిగా సీఎం కెసిఆర్ ప్రకటించిన తమ న్యాయపరమైన డిమాండులను నెరవేర్చడంలో ఇంతలా తార్కాణం చేయడం మంచిది కాదన్నారు.గత 78 రోజుల నుండి తమకు జీతాలు లేక కుటుంబాలు ఆర్థికంగా చితికల పడుతున్నాయని వాపోయారు.అసెంబ్లీ ముట్టడి సందర్భంగా ప్రభుత్వం రెండు సార్లు చర్చలకు పిలిచి తమకు స్పష్టమైన హామీ ఇవ్వకుండా సమ్మె విరమించండని ఒత్తిడి చేయడంపై వారు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.ఇప్పటికైనా ప్రభుత్వం వి.అర్.ఎల సమస్యలపై స్పందించక పోతే రాష్ట్ర జె.ఎ.సి పిలుపు మేరకు ఈ నెల 17 నుండి నిరవధిక నిరాహార దీక్ష చేపడతామ న్నారు.గత రెండున్నర నెలల నుండి చేస్తున్న న్యాయపరమైన పోరాటంలో అనేక మంది వి.అర్.ఎలు అశువులు బాసిన కూడా ఈ ప్రభుత్వం స్పందించక పోవడం విడ్డూరంగా ఉందన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి గతంలో సీఎం కెసిఆర్ తెలిపిన విధంగా వి.అర్.ఎల న్యాయ పరమైన డిమాండ్లను, హక్కులను వెంటనే అమలు చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో కోటగిరి మండల వి.అర్.ఎ సంఘం అధ్యక్షులు హైమద్,ప్రధాన కార్యదర్శి కిరణ్,కోశాధికారి షఫీ,సహాయ కార్యదర్శి నవీన్, సరుబాయ్,లక్రం,మల్లయ్య ,పీరయ్య,వీరేశం,శంకర్,రాములు,గో పి,గంగారాం,పోషట్టి,మైబుబ్,లక్ ష్మణ్,తదితరులు పాల్గొన్నారు.