: కోటగిరి మండల కాంగ్రెస్ నాయకుల ముందస్తు అరెస్ట్.
కోటగిరి జూలై 21 జనం సాక్షి:-అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీపై ఢిల్లీలో ఈ.డి కేసు దర్యాప్తు జరుగుతున్న నేపథ్యంలో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు హైదరాబాద్లో నిరసన దీక్షకు వెళ్ళే క్రమంలో కోటగిరి మండలానికి చెందిన పలువురు కాంగ్రెస్ నాయకులను గురువారం రోజున స్థానిక పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కి తరలించారు.ఈ సందర్భంగా ముందస్తుగా అరెస్ట్ అయిన వారిలో మాజీ సర్పంచ్,ఎంపీటీసీ కొట్టం మనోహర్,కోటగిరి గ్రామ అధ్యక్షులు అయ్యుబ్,
గిర్నీ రాజు,వహీద్,తదితరులు ఉన్నారు.ఈ సందర్భంగా కొట్టం మనోహర్ మాట్లాడుతూ జాతీయ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీపై ఈడీ సమన్లు జారీ చేయటం,విచారణల పేరుతో ఈ.డి ఆఫీస్కి పలు మార్లు పిలిపించడం కేంద్ర ప్రభుత్వ కక్ష సాధింపు చర్యను తీవ్ర స్థాయిలో ఖండిస్తున్నామన్నారు.ప్రజాస్వా మ్యంలో ఎవరైనా శాంతి యుతంగా నిరసన తెలిపే హక్కు లేదా అని కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వలను ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.