కోటి ఎకరాల మాగాణమే లక్ష్యం
మహబూబ్‌నగర్,సెప్టెంబర్8(జనంసాక్షి): తెలంగాణలో కోటి ఎకరాల మాగాణను సృష్టించడమే సిఎం కెసిఆర్ లక్ష్యమని ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు నిరంజన్ రెడ్డి అన్నారు. వెనకబడ్డ పాలమూరు ప్రాజెక్టులను పూర్తి చేసి ఇచ్చిన హావిూ మేరకునీరు అందిస్తామని అన్నారు. గత ప్రభుత్వాలు పాలమూరును విస్మరించగా, కెసిఆర్ అక్కున చేర్చుకుని వాటిని పూర్తి చేస్తున్నారని అన్నారు. తెలంగాణపై బిజెపి కల్లబొల్లి కబులర్లు మానాలని, విబజన సమస్యలపై కేంద్రంతో పోరాడాలని అన్నారు. విమోచన పేరుతో రాజకీయాలు తగవన్నారు. పాలమూరు ప్రజల చిరకాల వాంఛగా ఉన్న కల్వకుర్తి ఎత్తిపోతల కల సాకారమయ్యిందన్నారు. ప్రతి ఎకరాకునీరందించడం, కల్వకుర్తి ఎత్తిపోతలను ప్రారంభించడంతో చిరకాల వాంఛ నెరవేరిందన్నారు. కెసిఆర్ ప్రభుత్వం ప్రజల ఆకాంక్షను నెరవేర్చే ప్రభుత్వమని అన్నారు. కాంగ్రెస్ పాలనలో జిల్లాలోని ప్రాజెక్టులకు అన్యాయం జరిగిందని ఆరోపించారు. గతంలో ఉన్న ప్రభుత్వాలుగానీ, మంత్రులు గానీ చాలా మాట్లాడారు. కానీ చేసింది శూన్యమని విమర్శించారు.