కోడేరు మండలానికి చెందిన కళాకారులకు వనపర్తి, జోగులాంబ గద్వాల జిల్లాలలో ఉత్తమ కళాకారులుగా సన్మానం.

కోడేరు (జనం సాక్షి) సెప్టెంబర్ 22  కోడేరు మండలం మైలారం గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ ప్రముఖ కళాకారులు ఎన్ డప్పు స్వామి, ఎన్ సువర్ణ లను  తెలంగాణ రాష్ట్ర జాతీయ సమైక్యత ఉద్రోత్సవాల సంబరాలలో సందర్భంగా కోడేరు మండలం మైలారం గ్రామానికి చెందిన ప్రముఖ సీనియర్ కళాకారుడు ఎన్ డప్పు స్వామి మరియు ఎన్ సువర్ణ లను ఉత్తమ కళాకారులుగా తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మాత్యులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మరియు వనపర్తి జిల్లా కలెక్టర్ శ్రీమతి షేక్ యాస్మిన్ భాష మరియు జిల్లా ఎస్పీ అపూర్వరావు జెసి వేణుగోపాల్ చేతుల మీదుగా మరియు నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డి,డప్పు స్వామి వారి సతీమణి సువర్ణ లు ఉత్తమ కళాకారులుగా ఘనంగా సన్మానాలు అందుకున్నారు. ఉత్తమ కళాకారులుగా ఎంపిక చేసినందుకు గాను రాష్ట్ర మంత్రివర్యులకు అదే విధంగా వనపర్తి, కలెక్టర్, షేక్ యాస్మిన్ భాషాకు జైంట్ కలెక్టర్ కు ఎస్పీ అపూర్వ రావు వనపర్తి జిల్లా డిపిఆర్ఓ లకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు ప్రముఖ కళాకారులు డప్పు స్వామి తెలిపారు. అదేవిధంగా కోడేరు మండల పరిధిలోని నర్సాయిపల్లి గ్రామానికి చెందిన ప్రముఖ సీనియర్ కళాకారుడు సంధ్య డప్పు నరసింహ ను జోగులాంబ గద్వాల జిల్లా ఉత్తమ కళాకారుడుగా ఘనంగా జోగులాంబ  గద్వాల జిల్లా కలెక్టర్ అల్లంపూర్ ఎమ్మెల్యే అబ్రహం డప్పు నరసింహ ను ఘనంగా సన్మానించడం జరిగింది. ఈ సందర్భంగా డప్పు నరసింహ మాట్లాడుతూ ఉత్తమ కళాకారుడిగా నన్ను ఎంపిక చేసినందుకు జిల్లా కలెక్టర్ కు ఎమ్మెల్యే అబ్రహం కు అదే విధంగా డి పి ఆర్ ఓ కు రాష్ట్ర ప్రభుత్వానికి   కృతజ్ఞతలు తెలియజేశారు.