కోడేరు లో వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాలు.
బైక్ ర్యాలీ నిర్వహించిన : సిపిఎం.
కోడేరు (జనం సాక్షి) సెప్టెంబర్ 16 నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నియోజక వర్గం కోడేరు మండల కేంద్రంలో వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాల సందర్భంగా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన బైక్ ర్యాలీలో పాల్గొన్న సిపిఎం పార్టీ కోడేరు మండల ప్రధాన కార్యదర్శి పి నరసింహ మాట్లాడుతూ తెలంగాణలో భూస్వామ్య దోపిడీకి వ్యతిరేకంగా రజాకర్ల దాస్టికానికి ఎదురొడ్డి ఎర్ర జెండా నాయకత్వంలో రైతులు కూలీలు వెట్టి చాకిరికి వ్యతిరేకంగా వీరోచిత పోరాటం చేసి తమ దాస్య సుంకలాలను తెచ్చుకున్నారు.
కమ్యూనిస్టుల నాయకత్వంలో గ్రామాలలో భూస్వాములు ఆక్రల్లో ఉన్న భూములను పేదలు స్వాధీనం చేసుకొని భూస్వాముల గుండెల్లో వణుకు పుట్టించారని, ఈ పోరాట ఫలితంగా తెలంగాణలో సుమారు పది లక్షల ఎకరాల భూమి పేదలకు దక్కిందని అన్నారు భూస్వాలకు ఫెడలిస్టులకు పేద ప్రజలకు మధ్య జరిగిన ఈ పోరు సామాన్య ప్రజలను అక్రమాలకు వ్యతిరేకంగా ఐక్యం చేసిందని అన్నారు.
తెలంగాణ సాయుధ రైతంగ పోరాటంలో ఇలాంటి ప్రాతినిధ్యం లేని ఆర్ఎస్ఎస్ బిజెపి వాళ్లు ఈ ఉద్యమాన్ని హిందువులకు ముస్లింలకు జరిగిన పబ్బం గడుపుకోవడానికి ప్రయత్నిస్తున్నారని పలువురు విమర్శించారు.
తెలంగాణ రైతన్న పోరాట వారసత్వాన్ని మరణం చేసుకొని పేదలు గ్రామీణ రైతులు సంఘటితమై తమ హక్కుల కోసం పోరాడాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో సిపిఎం కోడేరు మండల కార్యదర్శి పి నరసింహ, మండల కమిటీ సభ్యులు ఎండి మాలిక్ వివిధ ప్రజాసంఘాల నాయకులు పి రవి, శివుడు, బుచ్చన్న రాజు, కాకము లక్ష్మయ్య కాకము వెంకటయ్య ,మరాటి వెంకటయ్య, సింగయ్యపల్లి శివ, ఎత్తం గ్రామ శ్రీను, వి రామచందర్ ,శివ, ప్రజానాట్యమండలి రవి, రాజాపూర్ నాగేంద్రo, కోడేరు గ్రామ సిపిఎం నాయకులు శ్రీ పర్వతాలు ఈశ్వర్ కృష్ణ వి లక్ష్మయ్య రంగస్వామి తదితరులు పాల్గొన్నారు