కోడ్ ముగియగానే ఉద్యోగ సమస్యల పరిష్కరం
కేసీఆర్‌ను కలిసిన ఉద్యోగ సంఘాల ప్రతినిధులు
హైదరాబాద్ 09 మార్చి (జనంసాక్షి): వేతన సవరణ సహా ఉద్యోగ, ఉపా ధ్యాయుల సమస్యలన్నింటినీ పరిష్క రించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ హావిూ ఇచ్చినట్లు ఉద్యోగ సంఘాలు తెలిపాయి. టీఎన్జీఓ, టీజీఓ, సచివా లయ సంఘం, పీఆర్టీయూ ప్రతినిధు లు ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్‌తో సమావేశమయ్యారు. ఉద్యోగుల సమ స్యలపై సుధీర్ఘంగా చర్చించారు. భేటీ అనంతరం ఉద్యోగ సంఘాల నేతలు విూడియాతో మాట్లాడారు. గతంలో ఇచ్చిన హావిూలు, పెండింగ్ సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు. ప్రస్తుతం ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లో ఉన్నందున ఎలాంటి ప్రకటన చేయలేనని.. కోడ్ ముగియగానే అన్ని సమస్యలను సానుకూలంగా పరిష్కరిస్తాననని సీఎం హావిూ ఇచ్చినట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో 27శాతం మధ్యంతర భృతి ఇచ్చిన నేపథ్యంలో దానికి ఒకటి లేదా రెండు శాతం ఎక్కువగానే పీఆర్సీ ప్రకటిస్తామని.. మార్చి నెల నుంచే పదవీ విరమణ వయస్సును 61 ఏళ్లకు పెంచుతామని సీఎం హావిూ ఇచ్చినట్లు నేతలు వివరించారు.