కోదండరాం రాసిన పుస్తకం ఆవిష్కరణ…

33

హైదరాబాద్ : తెలంగాణలో 1998 తర్వాత చోటు చేసుకున్న పరిణామాలపై పుస్తకం రాసినట్లు తెలంగాణ జేఏసీ ఛైర్మన్ కోదండ రామ్ తెలిపారు. ఈ పుస్తకంలో  తెలంగాణ రాష్ట్రానికి జరిగిన అన్యాయాలను వివరించానన్నారు. ప్రత్యేక రాష్ట్రం లభించినా.. సామాజిక మార్పు ఇంకా జరగాల్సి ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో పూర్తి స్థాయి రాజకీయ, సామాజిక మార్పు వచ్చే వరకూ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అన్నారు. మరిన్ని విషయాలతో మరో పుస్తకం రాయనున్నట్లు వివరించారు.