కోబాడ్‌ గాంధీ ఉగ్రవాది కాదు

2

– కేసు కొట్టేసిన ఢిల్లీ హైకోర్టు

న్యూఢిల్లీ,జూన్‌ 11(జనంసాక్షి): మావోయిస్టు సిద్ధాంతకర్త కోబాడ్‌ గాంధీ(68)పై ఉగ్రవాద వ్యతిరేక కార్యక్రమాల నిరోధక చట్టం(యూఏపీఏ) కింద నమోదైన కేసును ఢిల్లీ కోర్టు శుక్రవారం కొట్టివేసింది. అయితే తప్పుడు ధ్రువీకరణ పత్రాలతో ఢిల్లీలో నివసించిన కేసులో దోషిగా నిర్ధారించింది. నేరపూరిత కుట్ర, చీటింగ్‌, ఫోర్జరీకింద శిక్ష వేసింది.కేసు విచారణలో భాగంగా కోబాడ్‌  ఆరున్నరేళ్లు జైల్లోనే ఉన్నందున శిక్షనుమినహాయిస్తూ కోర్టురూ. 40 వేల జరిమానా విధించింది. కోబాడ్‌తో పాటు మరో మావోయిస్టు నేత రాజిందర్‌ కుమార్‌ను కోర్టు దోషిగా నిర్ధారించినా, కస్టడీలోనే జైలు శిక్ష పూర్తవడంతో రూ. 20 వేల ఫైన్‌ విధించింది.