కోర్టును సందర్శించిన అల్ఫోర్స్ విద్యార్థులు

కరీంనగర్ బ్యూరో( జనం సాక్షి)

అన్ని వర్గాల ప్రజలకు న్యాయం సమకూర్చేది న్యాయ స్థానం అని అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత డా॥వి. నరేందర్ రెడ్డి అన్నారు స్థానిక కొత్తపల్లిలోని అల్ఫోర్స్ ఇ – టెక్నో పాఠశాలలో 6, 7 వ తరగతి విద్యార్థులు జిల్లా కోర్టు సందర్శన ముందు విద్యార్థులతో ముచ్చటించి , న్యాయ శాస్త్ర ప్రాముఖ్యతను విద్యార్థులకు వివరించారు . ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ న్యాయం ద్వారా శాంతి కలుగుతుందని, పలు సమస్యలకు , అంశాలకు న్యాయమే ఆధారమని , అభివృద్ది భాటన పయనించే తోడ్పాటునందిస్తుందని వారు చెప్పారు . నేడు చాలా మంది న్యాయం అందక సతమతవుతున్నారని, సమస్యలు పరిష్కారం కాకపోవడంతో అభివృద్ధి కుంటపడుతుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు . ప్రపంచంలో న్యాయ శాస్త్రం ప్రథమ పాత్రను పోషిస్తున్నదని , ప్రగతి బాటన పయనించేటట్టుగా చేయూతనిస్తుందని అభిప్రాయపడ్డారు . ప్రతి సంవత్సరం జులై 17 ను అంతర్జాతీయ న్యాయదినోత్సవంగా నిర్వహించుకుంటారని వెల్లడించారు. పెండింగ్ లో ఉన్న పలు కేసులను పరిష్కారిస్తారని చెప్పారు . విద్యార్థులకు న్యాయ వ్యవస్థ పట్ల అవగాహన కల్పించడానికి న్యాయవాదులు వ్యవహరిస్తున్న తీరు, అందించే తోడ్పాటు విద్యార్థులకు ప్రత్యక్షంగా తెలియజేయడానికి విద్యార్థులను జిల్లా కేంద్రంలోని కోర్టుకు తీసుకవెల్లడం జరిగినదని చెప్పారు . ఈ సందర్శనలో విద్యార్థులు కోర్టు ఆవరణలో పలువురు న్యాయవాదులకు అంతర్జాతీయ న్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసి వారి ఆనందాన్ని రెట్టింపు చేసుకున్నారు . సందర్శనలో భాగంగా ప్రముఖ న్యాయవాది , అడిషినల్ పబ్లిక్ ప్రాస్యుకూటర్ కనుకుల సంజీవ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులకు ప్రాథమిక దశనుండే అవగాహన కల్పించాలని , చట్టాలలోని ప్రాముఖ్యతను తెలిపి వాటి ప్రభావాలు విద్యార్థులకు తెలిసేటట్టుగా చెప్పాలని వారు సూచించారు . ప్రతి విద్యార్థికి న్యాయ వ్యవస్థలోని పలు అంశాలు న్యాయం వెలువరించే మార్గాలను తెలియపరచి నట్లయితే లాభదాయకంగా ఉంటుందని తెలిపారు సమయం ఆదా చేయవచ్చునని వారు చెప్పారు . అంతర్జాతీయ న్యాయస్థానం వారు ఈ కార్యక్రమాన్ని ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్నారని ప్రశంసిస్తూ ప్రపంచ వ్యాప్తంగా ఈ కార్యక్రమం పట్ల అవగాహన పెంపొందించి న్యాయాన్ని అందరికి అందించాలని సూచించారు . సందర్శనలో భాగంగా విద్యార్థులు బార్ అసోసియేషన్ అధ్యక్షులు ఎర్రం రాజిరెడ్డి , సీనియర్ న్యాయవాదులు నరేందుల రాజేంద్ర ప్రసాద్ , లెక్కల రాంరెడ్డి , సుధాకర్ రావులతో పాటు పలువురు న్యాయవాదులను కలసి అంతర్జాతీయ దినోత్సవ శు భకాంక్షలు తెలియజేసారు వారి సేవలను కొనియాడారు . ఈ కార్యక్రమంలో సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయులు , పాఠశాల సిబ్బంది , విద్యార్థులు పాల్గొన్నారు