కోల్‌కతాలో కూలిన ఫ్లై ఓవర్‌

తెల్లవారుజాము కావడంతో
తప్పిన పెనుప్రమాదం
కోల్‌కత్తా, (జనంసాక్షి) :
నగరంలోని ఓ ఫ్లై ఓవర్‌లో కొంతభాగం ఆదివారం తెల్లవా రుజా మున కుప్ప కూలింది. ఈ ప్రమాదంలో ముగ్గురు గాయపడ్డారు. ప్రమాదం జరిగిన సమయం తెల్లవారు జాము కావడంతో ఫ్లై ఓవర్‌తో పాటు కింది రోడ్డుపైనా పెద్ద ప్రయా ణికులు లేరు. దీంతో పెను ప్రమాదం తప్పింది. ఉదయాన్నే కిక్కిరిసిపోయే కోల్‌కత్తా రోడ్లపై పగటి పూట ప్రమాదం జరిగి ఉంటే పరిస్థితి దారుణంగా ఉండేది. పాలకులు అభివృద్ధి సూచికలు తీసుకువస్తున్న ప్లై ఓవర్లు అంత సురక్షితం కాదనేది కొందరి వాదన. ఇలాంటి వాదనకు బలం చేకూర్చేలా ఇప్పటికే పలు నగరాల్లో కూలిన సంఘటనలున్నాయి. నిర్మాణ సమయంలో ప్రమాణాలు పాటించకపోవడం, పాలకుల నిర్లక్ష్యంతోనే ఇలాంటి ఘటనలు పునరావృత్తమవుతున్నాయని నిపుణులు పేర్కొన్నారు.