కోవిడ్ కేసులు పెరుగుతున్నాయి వ్యాక్సిన్ వేసుకోండి

కరీంనగర్ బ్యూరో (జనం సాక్షి) :
కోవిడ్ కేసులు పెరుగుతున్న కారణంగా 18 సంవత్సరాల నుండి 59 సంవత్సరాల వయస్సు గల వారందరికీ రెండు మోతాదులు తీసుకొని ఆరు నెలలు దాటినా అర్హులైన వారందరు ప్రికాషనరీ డోసు తీసుకోవాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ జువేరియా కరీంనగర్ గారు ఒక ప్రకటనలో తెలిపారు. గతంలో రెండు కొవాక్సిన్ మోతాదులు తీసుకున్న వారు కొవాక్సిన్ కు మాత్రమే తీసుకోవాలని ,కోవిశీల్డ్ రెండు మోతాదులు తీసుకున్న వారు కోవిశీల్డ్ మాత్రమే తీసుకోవాలని ఈ వ్యాక్సినేషన్ జిల్లాలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు మరియు పట్టణ ఆరోగ్య కేంద్రాలు, జమ్మికుంట లోని సామాజిక ఆరోగ్య కేంద్రం, హుజురాబాద్ లోని ఏరియా హాస్పిటల్ , జిల్లా ప్రధాన ఆస్పత్రి మరియు ఇవే కాకుండా జిల్లా కేంద్రం లోని అంబేద్కర్ ఇండోర్ స్టేడియం భగథ నగర్ ,బాంబే హై స్కూల్ మోతాజఖానా లో ప్రతిరోజు వ్యాక్సినేషన్ చేయబడును.కనుక రెండు డోసుల తీసుకున్న తర్వాత ఆరు నెలలు దాటినా 18 సంవత్సరాలు పైబడిన వారు అందరూ ప్రికాషనరీ డోసు తీసుకోవాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి గారు కోరారు .