కోస్తాంధ్ర మీదుగా అల్పపీడన ద్రోణి

అక్కడక్కడా వానలు

హైదరాబాద్‌: ఛత్తీస్‌గఢ్‌ నుంచి దక్షిణ తమిళనాడు వరకు కోస్తాంధ్ర మీదుగా అల్పపీడన ద్రోణి ఏర్పడిందని, దీని కారణంగా కోస్తాంధ్రలో క్యుములో నింబస్‌ మేఘాలు చురుగ్గా కదులుతున్నాయని విశాఖలోని వాతావరణ కేంద్రం పేర్కొంది. క్యుములో నింబస్‌ మేఘాల ప్రభావంతో కోస్తాలో అక్కడక్కడ ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది.