క్రమశిక్షణ నిబద్ధతతో పనిచేస్తూ పోలీసు శాఖకు గౌరవం తేవాలి.ఎస్పీ రాహుల్ హెగ్డే.

సిరిసిల్ల. నవంబర్.05.(జనం సాక్షి). క్రమశిక్షణ నిబద్ధతతో పనిచేస్తూ ప్రజల్లో పోలీసు శాఖకు గౌరవం తీసుకురావాలని ఎస్టీ రాహుల్ హెగ్డే అన్నారు. శనివారం పోలీస్ హెడ్ క్వార్టర్లు జిల్లా ఆర్మీడ్,రిజర్వ్ సీవిల్ పోలీస్ సిబ్బందికి వీక్లీ నిర్వహించారు. కార్యక్రమానికి హాజరై గౌరవ వందనం స్వీకరించిన అనంతరం ఎస్పీ రాహుల్ హెగ్డే మాట్లాడుతూ ప్రతి ఒక్కరు ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని ప్రతి రోజు ఉదయం కనీసం అరగంట యోగ ధ్యానం నడక ఏదో ఒకటి చేయాలని సూచించారు. సాధ్యమైనంతవరకు బయట ఆహార పదార్థాలు తినవద్దని అన్నారు. వీక్లీ పీరియడ్ వల్ల సిబ్బందికి యూనిట్ గా ఉండడం తో పాటు ఫిజికల్ ఫిట్నెస్ కు ఉపయోగపడుతుందని తెలిపారు. క్రమశిక్షణ నిబద్ధతతో విధులు నిర్వహిస్తూ పోలీసు శాఖకు ప్రజల్లో గౌరవం తీసుకురావాలని అన్నారు. కార్యక్రమంలో ఎస్పీ చంద్రయ్య, డిఎస్పి విశ్వప్రసాద్, ఆర్ ఐ లు రజనీకాంత్ యాదగిరి సీఐలు అనిల్ కుమార్ ఉపేందర్ ఎస్సైలు ఆర్ఎస్ఐలు ఆర్మీడ్ సివిల్ సిబ్బంది పాల్గొన్నారు