క్రీడాకారులకు ” మనం స్వచ్ఛంద సంస్థ ” అండ
వరంగల్ ఈస్ట్, జూన్ 23(జనం సాక్షి):
మనం స్వచ్ఛంద సంస్థ అండగా ఉంటుందని సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు రాజేంద్ర ప్రసాద్ అన్నారు మనం స్వచ్ఛంద సంస్థ సభ్యులైన విన్నూ జన్మదినం పురస్కరించుకొని తిమ్మాపూర్ క్రాస్ లో గల న్యూ లైఫ్ సొసైటీ అనాధ ఆశ్రమంలో పిల్లలకు హాకి బ్యాట్లు, బాల్లు, షూ గురువారం అందజేశారు. ఈ సందర్భంగా మనం స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు గోళ్ళ రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ ఈ అనాధ శరణాలయం లోని పిల్లలు క్రీడలపట్ల ఆసక్తి చూపుతున్నారని తెలుసుకుని, వారికి ఇరవైఒక్క వేల రూపాయల విలువ గల బ్యాట్లు, బాల్లు, షూస్, సాక్స్ అందజేయడం జరిగిందని తెలియజేశారు. జిల్లాస్థాయిలో ఆడుతున్న ఈ పిల్లలు జిల్లా స్థాయిలో లో రాష్ట్రస్థాయిలో జాతీయ స్థాయిలోనూ రాణించాలని విజయం సాధించాలని రాజేంద్ర ప్రసాద్ అన్నారు. వరంగల్ కు, రాష్ట్రానికి మంచి పేరు తేవాలని కోరారు. దేశం గర్వించేలా ఎదగాలని విజయం సాధించాలని అన్నారు. వారిలో క్రీడాస్ఫూర్తి నింపుటకు తాము ఎప్పుడూ తోడు ఉంటామన్నారు. భవిష్యత్తులోనూ సహాయ సహకారాలు అందించడం లోనూ వెంట ఉంటామన్నారు. చదువులు ఎంత ముఖ్యమో క్రీడలు కూడా అంతే ముఖ్యమన్నారు. ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో లో శైలేష్,నాగరాజు , వరంగల్ పోలీస్ కానిస్టేబుల్ కన్నె రాజు ( స్విమ్మర్ రాజు ), వినోద ,బిటుకూరి యాకయ్య తదితరులు పాల్గొన్నారు.