క్రీడా పోటీలను ప్రారంభించిన సీఐ సీతయ్య

మక్తల్ ఆగస్టు 28 (జనంసాక్షి) జాతీయ క్రీడల దినోత్సవం పురస్కరించుకొని తగ్గాఫ్ వార్ ,మాస్టర్ అథ్లెటిక్స్, షూటింగ్ బాల్ ,ఏకలవ్య స్పోర్ట్స్ క్లబ్ ఆధ్వర్యంలో మక్తల్ మినీ స్టేడియం గ్రౌండ్లో బాలికలకు తగ్గాఫ్ వార్ పోటీలను ప్రారంభించారు. ఈ కార్యక్రానికి మక్తల్ సీఐ సీతయ్య ముఖ్య అతిథిగా హాజరైన క్రీడాకారులను పరిచయం చేసుకొని క్రీడలను ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందన్నారు. నేను కూడా విద్యార్థి దశలో జిల్లా స్థాయిలో కోకో ఆడి రాష్ట్ర, జాతీయ స్థాయిలో ఆడి పోలీసు ఉద్యోగం సంపాదించానని తెలిపారు. క్రీడా దినోత్సవ సందర్భంగా క్రీడలు నిర్వహిస్తున్న విశ్రాంత పీఈటి బి.గోపాలమును అభినందించారు. క్రీడాకారుల కొరకు తన వంతు సహాయ సహకారం అందిస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో తగ్గాఫ్ వార్ అధ్యక్షుడు రఘు ప్రసన్న బట్, గౌరవ అధ్యక్షుడు తాన్ సింగ్, ప్రధాన కార్యదర్శి విశ్రాంత పీఈటి బి.గోపాలం, పీఈటీలు విష్ణువర్ధన్ రెడ్డి ,అమ్రేష్, బి. రూప, దామోదర్, రమేష, బి. దీప ,మంజుల, రమణమ్మ హర్షవర్ధన్ ,మధుసూదన్ రెడ్డి, ప్రశాంతి ,200 మంది బాలికలు పాల్గొన్నారు.