క్లీన్‌టెక్‌ ఆవిష్కరణలపై అధ్యయనం

5

– టెస్లా ఎలక్ట్రిక్‌ కారులో మంత్రి షికారు

– బయో-డిగ్రేడబుల్‌ ప్లాస్టిక్‌పై చర్చ

– ప్లాస్టిక్‌ రహిత నగరాలుగా తీర్చిదిద్దేదిశగా ఇదో తొలి అడుగు

– అమెరికా పర్యటనలో మంత్రి కేటీఆర్‌

వాషింగ్టన్‌, జూన్‌ 5(జనంసాక్షి):పెట్టుబడులే లక్ష్యంగా సాగుతున్న ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావు అమెరికా పర్యటనలో అనేక వినూత్న టెక్నాలజీలు, అవిష్కరణలను అధ్యయనం చేస్తూ సాగుతున్నది. అమెరికా మిడ్‌ వెస్ట్‌ పర్యటనలో భాగంగా  మున్సిపల్‌ , నగర పరిపాలన వంటి పాలనా పద్దతులను అధ్యాయనం చేసిన మంత్రి, సిలికాన్‌ వ్యాలీ పర్యటనలో భాగంగా సాంప్రదాయేతర ఇంధన వనరులపై ఆసక్తికర నూతన ఆవిష్కరణలను స్వయంగా పరిశీలించారు. తొలుత కాలిఫోర్నియా రాష్ట్రం ఏర్పాటు చేసిన క్లీన్‌ టెక్‌ ఇంక్యుబేటర్‌ ఐ-హబ్‌ లో నెలకొల్పిన అనేక సాంప్రదాయేతర ఇంధన వనరుల అంకుర పరిశ్రమలను (స్టార్టప్స్‌) తిలకించారు. అక్కడి జౌత్సాహిక పరిశోధకులతో వివిధ చర్చించారు.ఐ-హబ్‌ లో ఒక అంకుర పరిశ్రమ రూపొందించిన బయో-డిగ్రేడబుల్‌ ప్లాస్టిక్‌ గ్లాసు, మంత్రిని అమితంగా ఆకర్శించింది. మామూలుగానైతే ప్లాస్టిక్‌ తో తయారైనా ఏదైనా వస్తువు వాడి పారేసిన తరువాత అది మట్టిలో కలవడానికి 450-1000 సంవత్సరాలు పడుతుంది. కానీ రెన్యువబుల్‌ కంపెనీ కనుగొన్న నూతన టెక్నాలజీ సాయంతో తయారు చేసిన ప్లాస్టిక్‌ గ్లాసు వాడి పారేసినంక కేవలం ఆరు నెలల్లో మట్టిలో కలిసిపోతుందన్నారు. ఈ పర్యావరణహిత టెక్నాలజీ కంపెనీ ఇప్పుడు అమెరికాలో సంచలనం సృష్టిస్తోందని, ఇటువంటి పర్యావరణహిత టెక్నాలజీలను మనదేశంలో కూడా అతి తొందరలో ప్రవేశపెట్టాలని మంత్రి కేటీఆర్‌ అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా హైదరాబాద్‌ లాంటి నగరాల్లో ప్లాస్టిక్‌ రహిత నగరాలుగా తీర్చి దిద్దేందు ఇలాంటి అధునాతన, వినూత్నమైన ప్రయోగాలు ఉపయోగపడతాయని మంత్రి కెటియార్‌ అన్నారు. సిలికాన్‌ వ్యాలీలో అనేక పేరున్న కంపెనీలతో చర్చలకి సాగిన మంత్రిపర్యటన ఆసాంతం ఎలెక్ట్రిక్‌ కారు టెస్లా మోడెల్‌ ఎక్స్‌ కారులో సాగింది. పర్యటనకి తొలిరోజు నుంచి మంత్రి ఇదే కారులో పర్యటిస్తున్నారు. ఈ- కారు పరిశీలన కోసం మంత్రి స్వయంగా నడిపి చూసారు. 2003లో ప్రారంభం అయిన టెస్లా కంపెనీ సాంప్రదాయేతర ఇంధన రంగంలో సంచలనం సృష్టిస్తొంది. సిలికాన్‌ వ్యాలీలో యువ ఇంజనీర్‌ ఎలాన్‌ మస్క్‌ నేతృత్వంలో నడుస్తున్న టెస్లా మోటర్స్‌ తయారు చేస్తున్న ఎలెక్ట్రిక్‌ కార్లు, వాటిలో ఉన్న ఫీచర్లు ప్రపంచవ్యాప్తంగా అనేకమంది దృష్టిని ఆకర్శిస్తున్నాయని మంత్రి అన్నారు.తాజాగా రిలీజయిన టెస్లా మోడల్‌ ఎక్స్‌ ఎలెక్ట్రిక్‌ కారు విహంగంలా రెక్కల ఆకారంలో ఉన్న డోర్లు కలిగి ఉంది. కారు ముందు విండ్‌ షీల్డ్‌ కూడా పానోరామిక్‌ వ్యూ ఉండి అన్ని దిక్కులను, ఆకాశాన్నీ చూసే వెసులుబాటు కలిపిస్తుంది. ఇక స్టార్ట్‌ అయిన కేవలం 4 సెకండ్ల కన్న తక్కువలోనే 100కిలోవిూటర్ల వేగాన్ని అందుకోగలదీ కారు. ఈ కారు తన చుట్టు ఉన్న వాహనాలను, ట్రాఫ్రిక్‌ అలర్ట్స్‌ని ఏప్పటికప్పుడు అందిస్తూ డ్రైవర్‌ సమాచారం ఇస్తున్నది. అమెరికన్‌ రోడ్ల విూద కూడా అతి తక్కువగా కనిపించే టెస్లా మోడల్‌ ఎక్స్‌ కారులో మంత్రి కేటీఆర్‌ ప్రయాణిస్తుంటే అనేకమంది ఆసక్తిగా గమనించారు. అద్భుతమైన అలోచనల, విభిన్నంగా అలోచించే తత్వం ద్వారా ప్రపంచగతిని మార్చే ఫలితాలు వస్తాయన్నారు. టెస్లా అవిష్కరణ ఇలాంటిదే అని మంత్రి అన్నారు. సిలికాన్‌ వ్యాలీతో జరుగుతున్న పరిశోధనలు, టిహబ్‌ లాంటి చోట్ల ఉన్న జౌత్సాహిక పరిశోధకులకి టెస్లా విజయ

ప్రస్దానం స్పూరి నిస్తుందన్నారు.