క్షిపణి రక్షణ వ్యవస్థను పరిక్షించిన అమెరికా
హవాయి,ఆగస్టు30 : అమెరికా భూభాగంపై క్షిపణితో దాడి చేస్తామని ఉత్తర కొరియా ఇటీవల హెచ్చరించిన నేపథ్యంలో అమెరికా అప్రమత్తమైంది. ముందు జాగ్రత్తగా తమ క్షిపణి రక్షణ వ్యవస్థను పరీక్షించుకుంది. హవాయి తీరంలో అమెరికా మిస్సైల్ డిఫెన్స్ ఏజెన్సీ (ఎండీఏ), నేవీ సంయుక్తంగా మిస్సైల్ డిఫెన్స్ పరీక్షను నిర్వహించింది. ఈ పరీక్ష విజయవంతమైనట్లు ఏండీఏ ఒక ప్రకటనలో వెల్లడించింది. జపాన్ విూదుగా ఉత్తర కొరియా క్షిపణిని ప్రయోగించిన తర్వాతి రోజే అమెరికా తమ క్షిపణి రక్షణ వ్యవస్థను పరీక్షించడం గమనార్హం. అయితే ఎంతో ముందుగానే షెడ్యూల్ చేసిన టెస్ట్ అని ఎండీఏ తెలిపింది. స్టాండర్డ్ మిస్సైల్-6 గైడెడ్ మిస్సైల్స్‌ను ఈ పరీక్ష కోసం ఉపయోగించారు. ఇది విజయవంతంగా ఓ విూడియం రేంజ్ బాలిస్టిక్ మిస్సైల్‌ను ఛేదించింది. ఈ నౌకాదళ విభాగ క్షిపణి రక్షణ వ్యవస్థ బాలిస్టిక్ మిస్సైల్స్‌ను అడ్డుకునే తమ సామర్థ్యాన్ని మరింత పెంచిందని ఎండీఏ స్పష్టంచేసింది. ఇది ఒకరకంగా ఉత్తర కొరియాకు పెంటగాన్ ఇచ్చిన హెచ్చరిక లాంటిదని విశ్లేషకులు భావిస్తున్నారు. మంగళవారం బాలిస్టిక్ మిస్సైల్‌ను జపాన్ విూదుగా ప్రయోగించిన తర్వాత ఇది కేవలం క్ట్గం/న్ రైజరే అని ఉత్తర కొరియా హెచ్చరించిన సంగతి విదితమే.