ఖమ్మంలో ఘోర రోడ్డు ప్రమాదం

4

ఖమ్మం,ఆగస్టు 22(జనంసాక్షి):ఖమ్మం జిల్లాలో జరిగిన ఘోర రోడ్డుప్రమాదంలో కనీసం పదిమంది మృతి చెందారు. ఓ ప్రైవేట్‌ బస్సు బోల్తా పడడంతో ఈ దుర్ఘటనజరిగింది. సోమవారం తెల్లవారుజామున ఈ ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్‌ నుంచి తూర్పుగోదావరి జిల్లా కాకినాడ వెళ్తున్న యాత్రాజినీ బస్సు అదుపుతప్పి కాల్వలో బోల్తాపడింది ఈ ప్రమాదంలో 10మంది మృతిచెందగా, 18మంది ప్రయాణికులు గాయపడ్డారు. హైదరాబాద్‌లోని మియాపూర్‌ నుంచి ఆదివారం రాత్రి యాత్రాజినీ బస్సు కాకినాడ బయలుదేరింది. తెల్లవారుజామున 2.30గంటలకు నాయకన్‌గూడెం వద్దకు చేరుకోగానే బస్సు అదుపుతప్పి నాగార్జునసాగర్‌ ఎడమకాలువ వంతెనపై నుంచి బోల్తాపడింది. ఘటనా స్థలంలో ఏడుగురు మృతి చెందగా, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరో ముగ్గురు మృతిచెందారు. 18 మంది క్షతగాత్రులు ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 31 మంది ప్రయాణికులు ఉన్నారు. బాధితుల్లో ఎక్కువ మంది తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాకు చెందినవారే ఉన్నారు. అతివేగం, డ్రైవర్‌ సడన్‌ బ్రేక్‌ వేయడంతో బస్సు అదుపుతప్పి వంతెనపై నుంచి కాల్వలో బోల్తాపడిందని బాధితులు చెబుతున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే డ్రైవర్‌ పరారయ్యాడు. స్థానికులు బస్సులోంచి క్షతగాత్రులను బయటకు తీశారు. 3 అంబులెన్స్‌ల్లో బాధితులను ఖమ్మం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఖమ్మం జిల్లా ఎస్సీ షానావాజ్‌

ఖాసీం, డీఎస్పీ సురేశ్‌కుమార్‌ ఘటనాస్థలికి చేరుకొని సహాయకక చర్యలను పర్యవేక్షించారు. రెండు భారీ క్రేన్ల సాయంతో కాల్వలోంచి బస్సును బయటకు తీశారు. దాదాపు 5గంటల పాటు సహాయకచర్యలు కొనసాగాయి.

బాధితులకు అధికారుల పరామర్శ

కూసుమంచి మండలం నాయకన్‌గూడెం వద్ద జరిగిన బస్సు ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులను ఖమ్మం జిల్లా కలెక్టర్‌ లోకేష్‌కుమార్‌, ఎస్పీ షానవాజ్‌ ఖాసీం పరామర్శించారు. ఇప్పటి వరుకు ఈ ఘటనలో గాయపడిన 19 మందిని ఖమ్మం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రకాశం జిల్లా మర్కాపురానికి చెందిన అజారుద్దీన్‌ (35) చికిత్స పొందుతూ మృతి చెందారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని కలెక్టర్‌, ఎస్పీ వైద్యులను ఆదేశించారు.

ఇరు రాష్ట్రాల సిఎంలగ్భ్భ్రాంతి

ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం నాయకన్‌గూడెం వద్ద జరిగిన బస్సు ప్రమాద ఘటనపై తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ తీవ్ర దిగ్భాం/-రతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులను మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. బాధిత కుటుంబీకులకు సమాచారం చేరవేసి సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారు.తెలుగు రాష్ట్రాల్లో  జరిగిన రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాలపై ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్రగ్భ్భ్రాంతి వ్యక్తం చేశారు. రోడ్డు ప్రమాదాలపై తూర్పుగోదావరి, చిత్తూరు జిల్లాల కలెక్టర్లతో సీఎం ఫోన్లో మాట్లాడారు. పుష్కర యాత్రికులు ఇళ్లకు చేరే వరకు అధికారులు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని, అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ఈరోజు తెల్లవారుజామున ఖమ్మం జిల్లాలో ప్రైవేటు బస్సు అదుపు తప్పి బోల్తాపడిన ప్రమాదంలో 10మంది మృతి చెందారు. చిత్తూరు జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతిచెందారు.