ఖమ్మం నగరపాలక మేయర్‌గా పాపాలాల్‌ డిప్యూటీ మేయర్ గా బత్తుల మురళీ

7హైదరాబాద్: ఖమ్మం కార్పొరేషన్ నూతన పాలకవర్గం మంగళవారం ఉదయం కొలువుదీరింది.  మేయర్ గా డాక్టర్ పాపాలాల్, డిప్యూటీ మేయర్ గా బత్తుల మురళీ లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఉదయం 11 గంటలకు ఎన్నికల ప్రిసైడింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ లోకేష్‌కుమార్ కార్పొరేటర్లు, మేయర్, డిప్యూటీ మేయర్ చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ఎన్నికైన మేయర్, డిప్యూటీ మేయర్లను రోడ్డు, భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు అభినందించారు.

అయితే మేయర్ ఎన్నికపై టీఆర్ఎస్ కార్పొరేటర్ రామ్మూర్తి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎన్నిక జరిగే వరకు  రామ్మూర్తిని టూటౌన్ పీఎస్ నిర్బంధించినట్టు తెలుస్తోంది. మేయర, డిప్యూటీ ఎన్నిక తర్వాతే కార్పొరేటర్ గా రామ్మూర్తి చేత ప్రమాణం స్వీకారం చేయించారు.

కాగా సోమవారం రాత్రి వరకు కూడా మేయర్, డిప్యూటీ మేయర్ల విషయమై అధికారికంగా ఎటువంటి ప్రకటన వెలువడలేదు. సీల్డ్ కవర్లోనే మేయర్, డిప్యూటీ మేయర్ల పేర్లను ఉంచి ఎన్నిక సమయంలోనే అభ్యర్థలను ప్రకటించారు. డిప్యూటీ మేయర్ పదవికి విపరీతమైన పోటీ నెలకొంది. ఎక్కువ సంఖ్యలో ఆశావహులు ఈ పదవి కోసం పోటీ పడ్డారు.