ఖమ్మం వ్యవసాయం, న్యూస్‌టుడే: ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌లో పత్తి బస్తాలు సోమవారం వెల్లువెత్తాయి. ఒక్కరోజులో సుమారు 20వేల బస్తాలు వచ్చాయి. కేంద్ర ప్రభుత్వం పత్తికి ఈ ఏడాది క్వింటాకు రూ.4,320 మద్దతు ధర ప్రకటించింది. ప్రస్తుతం మార్కెట్‌లో నాణ్యమైన పత్తిని వ్యాపారులు క్వింటా రూ.4,400 చొప్పున కొనుగోలు చేస్తున్నారు. ఈ ధర చాలా తక్కువ నిల్వలకు మాత్రమే చెల్లిస్తున్నారు. అవిభాజ్య ఖమ్మం జిల్లాలో ఈఏడాది సుమారు 4.50 లక్షల ఎకరాల్లో రైతులు పత్తి సాగు చేయగా సుమారు 28 లక్షల క్వింటాళ్ల దిగుబడి వచ్చే అవకాశం ఉంది.