ఖరారైన అక్మల్‌ రీ ఎంట్రీ

సౌతాఫ్రికా సిరిస్‌, వరల్డ్‌కప్‌ టీ ట్వంటీ టీమ్‌లో చోటు
లాహోర్‌: ఎట్ట కేలకు పాకిస్థాన్‌ వికెట్‌ కీపర్‌ కమ్రాన్‌ అక్మల్‌ జాతీయ జట్టులోకితిరిగి వచ్చాడు. స్పాట్‌ ఫిక్సింగ్‌ ఆరోపణలలో చిక్కుకున్న అక్మల్‌ సౌతాఫ్రికాతో జరిగే టీ ట్వంటీలతో పాటు, టీ ట్వంటీ ప్రపంచకప్‌కూ ఎంపికయ్యాడు. అక్మల్‌ గత ఏడాది ప్రపంచకప్‌ తర్వాత పాక్‌కు ఆడలేదు. స్పాట్‌ ఫిక్సింగ్‌ వివాదంలో లండన్‌ యకోర్టు అతనికి కూడా సమన్లు జారీ చేయడంతో అక్మల్‌ చిక్కుల్లో పడ్డాడు. తర్వాత లండన్‌ పోలీసులు క్లియరెన్స్‌ ఇచ్చినప్పటికీ.. ఇంటిగ్రిటీ కమిటీ ముందు విచారణకు హాజరు కావాలని పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డు ఆదేశించింది. తాను నిర్థోషినంటూ అక్మల్‌ సమర్పించిన కొన్న పత్రాలపై విచారించేందుకే అతన్ని పిలిచినట్లు అప్పట్లో పిసీబీ వర్గాలు చెప్పాయి. పీసీబీ ఇంటిగ్రిటీ కమిటీ కూడా అక్మల్‌ పేరును పూర్తి స్థాయిలో క్లీన్‌చిట్‌గా ప్రకటిస్తే మళ్లీ జాతీయ జట్టు ఎంపికయ్యే అవకాశం కూడా ఉందని బోర్డు వర్గాలు చెప్పినట్టే టీ ట్వంటీ వరల్డ్‌కప్‌ చోటు దక్కింది. ఇదిలా ఉంటే పీసీబీ ప్రకటించిన 15మంది జాబితాలో బ్యాట్స్‌మెన్‌ ఇమ్రాన్‌ నజీర్‌ కూడా చోటు దక్కించుకున్నాడు. 2010 ఫిబ్రవరి తర్వాత నజీర్‌ జాతీయ జట్టుకు ఆడలేదు. అలాగే ఆల్‌రౌండర్‌ అబ్ధుల్‌ రజాక్‌ కూడా సౌతాఫ్రికా, టీ ట్వంటీ వరల్డ్‌కప్‌లకు ఎంపికయ్యాడు. అయితే అక్మల్‌, నజీర్‌, రజాక్‌ ముగ్గురికి పీసీబీ సెంట్రల్‌ కాంట్రాక్ట్‌ లేకపోవడం విశేషం.
మహ్మద్‌ హఫిజ్‌ టీ ట్వంటీ జట్టుకు సారథ్యం వహించనుండగా… బ్యాటింగ్‌ నసీర్‌ జంషెడ్‌ , ఉమర్‌ అక్మల్‌, అసద్‌ షఫీక్‌ చోటు దక్కించుకున్నాడు. అటు బౌలింగ్‌లో ఉమర్‌ గుల, మహ్మద్‌ సమీ, సయిద్‌ అజ్మల్‌, రాజా హసన్‌ ఎంపికయ్యారు. ఇక ఆల్‌రౌండర్ల విభాగంలో అబ్ధుల్‌ రజాక్‌, షాహిద్‌ అఫ్రిది, షోయబ్‌ మాలిక్‌, సొహైల్‌ తన్వీర్‌, యాసిర్‌ అరాఫత్‌లకు చోటు దక్కింది.