రైతులకు అందుబాటులో వేప నూనె.

 

 

 

 

 

 

 

బెల్లంపల్లి, జనవరి 9, (జనంసాక్షి)
బెల్లంపల్లి నియోజకవర్గం నెన్నెల మండల కేంద్రంలోని వ్యవసాయ శాఖ కార్యాలయం వేప నూనె అందుబాటులో ఉందని నెన్నెల మండల వ్యవసాయ అధికారిణి పుప్పాల సృజన తెలిపారు. నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ స్కీం లో భాగంగా వేప నూనె, ట్రి్చవుడెర్మా విరిడే, పిస్ బి (బయో ఏజెంట్) అందుబాటులో ఉన్నాయన్నారు. కావాల్సిన రైతులు పట్టా పాస్ బుక్, ఆధార్ కార్డు నకలు పత్రాలతో సంప్రదించాలన్నారు. ట్రి్చవుడెర్మా విరిడే కిలో 50 రూపాయలు, పిస్ బి కిలో 20 రూపాయలు, వేప నూనె లీటర్ 428 రూపాయలు చెల్లించి తీసుకోవాలన్నారు.