ఖాట్మండ్‌లో మరోసారి భారీ భూకంపం

రిక్టర్‌ స్కేల్‌పై తీవ్రత 7.2గా మోదు
నేపాల్‌ కేంద్రంగా భూకంపం

న్యూఢిల్లీ, మే 12 : నేపాల్‌ను మళ్లీ భూకంపం వణికించింది. రెండు వారాల క్రితం నేపాల్‌లో సంభవించిన భారీ భూకంపం నుంచి ఇంకా కోలుకోకముందే మంగళవారం మరోసారి భారీ భూ కంపం సంభవించింది. నిమిషం పాటు భూమి కంపించింది. ఎవరెస్టు సమీపంలో భూకంపం సంభవించింది. రిక్టర్‌ స్కేల్‌పై తీవ్రత 7.2గా నమోదు అయింది. భూ ఉపరితలం నుంచి 19 కిలోమీటర్ల లోపల భూకంపం సంభవించింది. దీంతో ప్రజలు ఇళ్లు, ఆఫీసుల నుంచి భయంతో రోడ్లమీదకు పరుగులు తీశారు.

ఈ భూకంపంవల్ల భారత్‌పైనా ప్రభావం చూపింది. రెండువారాల వ్యవధిలోనే నేపాల్‌లో భూకంపం సంభవించింది ఎవరెస్టు శిఖరంలోని నాంచే బజార్‌ను భూకంప కేంద్రంగా నిపుణులు గుర్తించారు. గత నెల ఏప్రిల్‌ 25న 7.8 తీవ్రతతో భూకంపం వచ్చిన విషయం తెలిసిందే. మరోవైపు ఖాట్మండ్‌ విమానాశ్రమంలో గందరగోళం నెలకొంది. ప్రయాణీకులు ప్రాణభయంతో బయటకు పరుగులు తీస్తున్నారు. పూర్తి వివరాలు అందవలసి ఉంది.