ఖానాపురంలో రాస్తారోకో
ఖానాపురం : మండలం బుదరావుపేటలో గత ఏడాది వర్షాభావంతో ఎండిపోయిన పంటలకు పరిహరం అందించాలని తెదేపా, తెరాస, వైకాపా అధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా అపార్టీ నేతలు ప్రకాశ్‌రావు.వెంకట్‌రెడ్డిలు మాట్లాడుతూ ప్రభుత్వం రైతులను నిర్లక్యం చేస్తోందన్నారు.నీరందక పంటలు ఎండిపోతే పరిహరం చెల్లించడంతో ప్రభుత్వం జాప్యం చేస్తోందన్నారు. ఏడీపీ రాజేంద్రం రావాలని పట్టుబట్టి రోడ్డుపై బైఠాయించారు. దీంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.