*ఖాబర్ధర్ బీజేపీ నాయకులారా.. మా నాయకుల జోలికొస్తే తగ్గేదెలే..*
-పాలకుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ధారావత్ రాజేష్ నాయక్
దేవరుప్పుల, జులై 29 (జనం సాక్షి): మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీ దిష్టిబొమ్మను దహనం చేశారు.
లోక్ సభలో ‘బిజెపి కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ’ ‘జాతీయ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి సోనియా గాంధీ,ఎంపీ అధిర్ రంజన్’ లపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు నిరసనగా జాతీయ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు ‘బివి శ్రీనివాస్,రాష్ట్ర యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు శివసేన రెడ్డి’ ఆదేశాల మేరకు దేవరుప్పుల మండల కేంద్రంలో పాలకుర్తి నియోజకవర్గ యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో ధర్నా,నిరసనలు చేసి కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ దిష్టి బొమ్మ ను దగ్దం చేసిన కాంగ్రెస్ పార్టీ శ్రేణులు. ఈ సదర్భంగా పాలకుర్తి నియోజకవర్గ యువజన కాంగ్రెస్ అధ్యక్షులు ధరావత్ రాజేష్ నాయక్,మండల యూత్ అధ్యక్షులు బోనగిరి యాకస్వామి లు మాట్లాడుతూ రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాబోతుందని దేశంలో కాంగ్రెస్ పార్టీ బలపడుతుందని అక్టోబర్ 2 వ తేదీ నుంచి రాహుల్ గాంధీ చేపట్టబోయే భారత్ జోడో యాత్ర వల్ల దేశ ప్రజలకు, యువతకి బిజెపి పార్టీ చేసిన మోసాల గురించి తెలిసిపోతుందనే భయంతోనే ఇలా చేశారని క్షమాపణ చెప్పాల్సింది సోనియా గాంధీ కాదని నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిననేపథ్యంలో గ్యాస్, డీజిల్, పెట్రోల్ ధరలు పెరిగిన కూడా ధరలను తగ్గించడానికి ప్రయత్నం చెయ్యనందుకు నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు ఇవ్వనందుకు ఈ దేశ ప్రధాని నరేంద్ర మోడీ అలాగే వారి క్యాబినెట్ లో ఉన్న మత్రులు బిజెపి పార్టీ ఎంపీలు యావత్ ఈ దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని అలాగే స్మృతి ఇరానీ మతి భ్రమించి మాట్లాడుతుందని స్మృతి ఇరానీ కూతురు చదువుకుంటుందని చెప్పిన తర్వాత గోవా యుజన కాంగ్రెస్ ఆమె కూతురు నడిపిస్తున్న బార్ అండ్ రెస్టారెంట్ గురించి ప్రజలకు తెలియజేయడం ద్వారా ఏం చేయాలో తెలియని స్థితిలో ఇలా మాట్లాడుతుందని ఇందుకు స్మృతి ఇరానీ నే క్షమాపణ చెప్పాలని ఇంకోసారి బిజెపి మంత్రులు గాని,ఎంపీలు గాని,నాయకులు గాని ఎవరైనా సోనియా గాంధీ,రాహుల్ గాంధీ,కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకుల పై అవాకులు చవాకులు పలికితే యువజన కాంగ్రెస్ చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు.సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ధర్నా చేస్తున్న కాంగ్రెస్ నాయకులను అదుపులోకి తీసుకొని పోలీస్ వాహనంలో స్థానిక పోలీస్ స్టేషన్ కు తరలించారు.
ఈ కార్యక్రమంలో నియోజకవర్గ యువజన కాంగ్రెస్ నాయకులు దామెర అనిల్,జాటోత్ రాము, యూత్ కాంగ్రెస్ మండల ఉపాధ్యక్షులు నాగరాజు, గుగులోత్ రాజేందర్, వివిధ గ్రామాల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు నాగరాజు, సురేష్, సుధీర్, బానోత్ ప్రవీణ్, తోటకూర వెంకన్న, ఉప్పల ప్రకాష్, ఎలప్ప, నగవెల్లి రాజు, గొంగడి ఉమేష్, నరేందర్, శ్రీకాంత్, ఉప్పల అనిల్, తదితులు పాల్గొన్నారు.
Attachments area