ఖుషి ఐటిఐ కళాశాలలో విద్యార్థులకు ఓటు అవగాహన సదస్సు.

భువనగిరి టౌన్ జనం సాక్షి):– కృషి ఐటిఐ లో ఓటరు అవగాహన సదస్సు
స్థానిక కృషి ఐటిఐ కళాశాలలో ఓటరు నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా భువనగిరి మున్సిపల్ కమిషనర్ బి నాగిరెడ్డి భువనగిరి తహసిల్దారు వీరా రెడ్డి నయాబ్ తాసిల్దార్ రుక్మిద్దీన్ కృషి ఐటిఐ కరస్పాండెంట్ దరిపల్లి ప్రవీణ్ కుమార్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ముందుగా మున్సిపల్ కమిషనర్ నాగిరెడ్డి మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్కరు ఓటు నమోదు చేసుకోవాలని అన్నారు. అనంతరం భువనగిరి తాసిల్దార్ మాట్లాడుతూ 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరు ఓటు హక్కు వినియోగించుకోవడానికి అర్హులని సూచించారు. నాయబ్ తాసిల్దార్ రుక్ముద్దీన్ మాట్లాడుతూ కొత్తగా ఓటు హక్కు నమోదు చేసుకునే యువతీ యువకులకు గ్రామాలలోని పోలింగ్ బూత్ వద్ద ప్రత్యేక ఓటు హక్కు నమోదు క్యాంపెయిన్ ఏర్పాటు చేయనున్నట్లు ఒకటి అక్టోబర్ 2023 నాటికి 18 ప్రతి ఒక్కరూ ఓటరుగా తమ పేరు నమోదు చేసుకోవాలని పోలింగ్ కేంద్రాల్లో ఓటరు జాబితా అందుబాటులో ఉంచడం జరిగిందని యువతీ యువకులు జాబితాలో తమ పేరు సరి చూసుకోవాలని అన్నారు. 18 ఏళ్లు నిండిన యువతీ యువకులు ఓటు హక్కు నమోదు చేసుకునేందుకు ప్రభుత్వం కల్పించిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కృషి ఐటిఐ కరస్పాండెంట్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ 18 సంవత్సరాలు నిండిన విద్యార్థులు రాజ్యాంగం మీకు కల్పించిన ఓటు అనే హక్కును మీరు కచ్చితంగా నమోదు చేసుకొని విధిగా పోలింగ్ లో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈరోజు మన కృషి ఐటిఐ కళాశాలలో ఓటరు అవగాహన కార్యక్రమంలో భాగంగా ఈవీఎం పనితీరుపై కూడా అవగాహన కల్పించిన మున్సిపల్ కమిషనర్ నాగిరెడ్డి భువనగిరి తాసిల్దార్ వీరారెడ్డి గారికి మరియు నాయబ్ తాసిల్దార్ రుక్ముద్దీన్ కృతజ్ఞతలు తెలియజేశారు.