ఖేల్‌రత్న రేసులో సర్ధార్‌సింగ్
న్యూఢిల్లీ, మే 4 (జనంసాక్షి) :
ప్రతిష్టాత్మకమైన రాజీవ్‌గాంధీ ఖేల్‌రత్న అవార్డుకు భారత హాకీ జట్టు కెప్టెన్ సర్థార్ సింగ్ నామినేట్ అయ్యాడు. సర్థార్ పేరును హాకీ ఇండియా సిఫార్సు చేసినట్టు నేషనల్ ఫెడరేషన్ వెల్లడించింది. గత ఏడాది నవంబర్ నుండి భారత హాకీ జట్టుకు సర్థార్‌సింగ్ సారథిగా వ్యవహరిస్తున్నాడు. అతని కెప్టెన్సీలో భారత్ దాదాపు 30 ఏళ్ళ తర్వాత ఛాంపియన్స్ ట్రోఫీ సెవిూస్‌కు చేరుకుంది. అలాగే సర్దార్ సారథ్యంలోనే భారత హాకీ జట్టు ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీలో సిల్వర్ మెడల్ గెలుచుకుంది. ఇటీవల ఏషియన్ హాకీ ఫెడరేషన్ సర్థార్‌ను 2011 సంవత్సరానికి బెస్ట్ ప్లేయర్ అవార్డునిచ్చి సత్కరించింది. అలాగే 2010 , 2011 ఎఫ్‌ఐహెచ్ వరల్డ్ స్టార్ టీమ్‌లో ప్లేయర్‌గా కూడా ఎంపికయ్యాడు. ఇదిలా ఉంటే అర్జున అవార్డుల కోసం డానిష్ ముజ్తాబా, రఘునాథ్, తుషార్ ఖండేకర్ , మాజీ కెప్టెన్ భరత ఛత్రి పేర్లను సిఫార్సు చేసినట్టు హాకీ ఇండియా తెలిపింది. మహిళల విభాగంలో భారత జట్టు కెప్టెన్ రీతూ రాణి, మాజీ కెప్టెన్ సాబా అంజుమ్, డిఫెండర్ జోయ్‌దీప్‌కౌర్ పేర్లను అర్జున అవార్డులకు సిఫార్సు చేసినట్టు వెల్లడించింది. ఇక ధ్యాన్‌చంద్ లైఫ్‌టైమ్ ఎఛీవ్‌మెంట్ అవార్డు కోసం ఒలింపియన్ సయ్యద్ అలీ పేరును హాకీ ఇండియా నామినేట్ చేసింది.