ఖైదీలకు రాఖీలు కట్టిన విద్యార్థులు
హుజూరాబాద్ టౌన్, ఆగష్టు 2 (జనంసాక్షి): రాఖీ పర్వదినాన్ని పురస్కరించుకొని హుజూరాబాద్ పట్టణంలోని సబ్ జైల్‌లో అండర్ ట్రయల్ ఖైదీలకు ఆదర్శ విద్యాలయంకు చెందిన విద్యార్థులు గురువారం రాఖీలు కట్టారు. ఈ సందర్భంగా సబ్‌జైలు ఇన్‌చార్జ్ సూపరిండెంట్ కె ప్రకాష్‌రావు మాట్లాడుతూ వివిధ కేసుల్లో జైలు జీవితం గడుపుతున్న అండర్ ట్రయల్ ఖైదీలకు విద్యార్థిని, విద్యార్థులు రాఖీలు కట్టడం ద్వారా వారిలో కొంత మార్పు వస్తుందన్నారు. సమాజంలో మనం ఒక భాగం అని అందరితో కలిసి ఉండాలని ఉధ్రేకాలకు లోనుకాకుడదనే భావన ఖైదీలలో పెరుగుతుందన్నారు. జైలు జీవితం గడుపుతున్న తమకు విద్యార్థులు రాఖీలు కట్టడం సంతోషాన్ని ఇచ్చిందని పలువురు ఖైదీలు తెలిపారు. అనంతరం విద్యార్థులకు, జైలు సిబ్బందికి మిఠాయిలు పంచి పెట్టారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కరెస్పాడెంట్ కిరణ్‌కుమార్, జైలు సిబ్బంది యండి ఫయాజ్, నగధర్, అశోక్, రాజు, నందకిషోర్, విద్యార్థులు పాల్గొన్నారు.