గంజా సరఫరా పై CCS పోలీసుల పటిష్ట నిఘా

– – -ఆదిలాబాద్,నిర్మల్ జిల్లా ను౦డి తెస్తూ జిల్లా లో సరఫరా చేస్తునట్లు గుర్తించిన పోలీసులు.

– – – సిరిసిల్ల జిల్లా కు చెందిన ఇద్దరు, జగిత్యాల జిల్లా కు చెందిన ఒకరు అరెస్ట్.

– – – 41 ప్యాకేట్స్ లో ప్యాక్ చేసిన అర కిలో గంజాయి, హుకా మిషన్ , మూడు సెల్ఫోన్స్ స్వాదినం.

– – – సీసీఎస్ ఇన్స్పెక్టర్ కిరణ్

జిల్లా ఎస్పీ శ్రీమతి సింధు శర్మ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు జిల్లా లో వివిధ పోలీస్ స్టేషన్ పరిదిలోని గంజాయిని సరఫరా చేస్తున్నారు అన్న పక్క సమాచారం మేరకు ఈరోజు సాయంత్రం CCS ఇన్స్పెక్టర్ కిరణ్ ఆధ్వర్యంలో జిల్లాలోని రాయికల్ పోలీస్ స్టేషన్ పరిదిలోని భూపతిపూర్ గ్రామ శివారులో గంజాయిని సరఫరా చేస్తున్న సిరిసిల్ల జిల్లా ఛిర్లవంచ గ్రామానికి చెందిన వేల్పుల శ్రీనివాస్, మరయు సిరిసిల్ల జిల్లా వల్లంపట్ల గ్రామానికి చెందిన నేరెళ్ళ విశ్వంత్ మరయు జగిత్యాల జిల్లా భూపతిపూర్ గ్రామానికి చెందిన కామని నితిన్ లను తనిఖీ చేయగా సుమారు 41 ప్యాకేట్స్ లో ప్యాక్ చేసిన అర కిలో గంజాయిని, హుకా మిషన్, 3 సెల్ ఫోన్స్,. స్వాధీనం చేసుకుని రాయికల్ పోలీసులకు అప్పగించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం జరుగుతుందని. ఈ యొక్క గంజాయిని ఆదిలాబాద్ జిల్లాలోని ఉట్నూర్ ,ఇంద్రవెల్లి మరియు నిర్మల్ జిల్లాలోని కడెం ప్రాంతాల నుండి తీసుకువస్తూ జిల్లాలో సరఫరా చేసినట్లు గుర్తించామన్నారు, ప్యాకేట్స్ లో ప్యాక్ చేసిన గంజాయిని స్కూల్ , కాలేజీ విద్యార్థులకు ,మరయు యువతకు ఒకో ప్యాకెట్ ను 500 నుOడి 700 రూపాయల వరకు అముతునట్లు గుర్తించమని సీసీఎస్ ఇన్స్పెక్టర్ కిరణ్ గారు తెలిపారు.

ఈ సందర్భంగా సీసీఎస్ఇన్స్పెక్టర్ కిరణ్ గారు మాట్లాడుతూ… గంజాయి అమ్మడం, సేవించడం రెండు నేరమని అన్నారు. చట్టాలు బలంగా ఉన్నాయని తర్వాత బాధపడి లాభం లేదని అన్నారు.గంజాయిని సరఫరా చేసిన తాగిన వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. యువత చెడు వ్యసనాలకు, గంజాయీ వంటి మత్తు పదార్థాలను తీసుకుని జీవితాన్ని నాశనం చేసుకోకూడదు అని కోరారు. తల్లిదండ్రులు పిల్లల ప్రవర్తనపై అనునిత్యం దృష్టిపెట్టాలని అన్నారు. ప్రవర్తనలో మార్పులు ఎప్పటికప్పుడు గమనిస్తు సరైన మార్గనిర్దేశం చేయాలని అన్నారు.

ఈయొక్క తనిఖీలో రాయికల్ ఎస్సై కిరణ్ , CCS ఎస్సై రవీందర్ మరయు సిబ్బంది ,రమేష్, సంతోష్ పాల్గొన్నారు ..