గంభీర్‌, యువరాజ్‌లపై వేటు

ధావన్‌, దినేశ్‌ కార్తీక్‌లకు చోటు

ముంబై, మే 4 (జనంసాక్షి) :

ఛాంపియన్స్‌ ట్రోఫీ కోసం భారత క్రికెట్‌ జట్టును ప్రకటించారు. సందీప్‌పాటిల్‌ సారథ్యం లోని సెలక్షన్‌ కమిటీ ఊహించని నిర్ణయాలు తీసు కుంది. ఓపెనర్‌ గౌతం గంభీర్‌, డాషింగ్‌ క్రికెటర్‌ యువరాజ్‌ సింగ్‌ పై వేటు వేసింది. వీరి స్థానంలో దినేశ్‌ కార్తీక్‌, శిఖర్‌ ధావన్‌లను ఎంపిక చేసింది. యువీ, గంభీర్‌ జనవరిలో ఇంగ్లాండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో ఆడారు. వీరిద్దరూ ఆశించిన స్థాయిలో రాణించకపోవడం, ప్రస్తుతం జరుగుతోన్న ఐపీఎల్‌లోనూ వారి ప్రదర్శన సరిగా లేకపోవడంతో వేటు వేసేందుకే మొగ్గుచూపారు. అలాగే ఇంగ్లాండ్‌పై ఆడిన చటేశ్వర పుజారా గాయంతో దూరమవగా… రహానే, అశోక్‌ దిండా, షవిూ అహ్మద్‌లకు కూడా చోటు దక్కలేదు.ఆస్టేల్రియాపై టెస్ట్‌ సిరీస్‌లో సెంచరీతో అదరగొట్టిన శిఖర్‌ ధావన్‌ ప్రస్తుతం గాయం నుండి కోలుకుని ఐపీఎల్‌లో కూడా రాణిస్తున్నాడు. దీంతో ధావన్‌ ఎంపికపై సెలక్టర్లు ముందుగానే నిర్ణయానికొచ్చేశారు. అలాగే చాలా కాలం తర్వాత దినేష్‌ కార్తీక్‌కు పిలుపునిచ్చారు. ముంబై ఇండియన్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తోన్న కార్తీక్‌ పరుగుల వరద పారిస్తున్నాడు. వీరితో పాటు ఆల్‌రౌండర్‌ ఇర్ఫాన్‌ పఠాన్‌, సీమర్‌ వినయ్‌ కుమార్‌తో పాటు మరో ఓపెనర్‌ మురళీ విజయ్‌ కూడా చోటు దక్కించుకున్నారు. ప్రస్తుతం సెలక్టర్లు ప్రకటించిన జాబితాలో ఐదుగురు స్పెషలిస్ట్‌ బ్యాట్స్‌మెన్‌, ఇద్దరు వికెట్‌ కీపర్లు ఉన్నారు. అలాగే ఇద్దరు స్పిన్నర్లు, ఒక పార్ట్‌టైమ్‌ స్పిన్నర్‌చో పాటు ఐదుగురు ఫాస్ట్‌బౌలర్లను ఎంపిక చేశారు. ఐపీఎల్‌లో వికెట్ల వేటలో ముందున్న స్పిన్నర్‌ అమిత్‌మిశ్రా కూడా చాలా కాలం తర్వాత జాతీయ జట్టులోకి తిరిగి వచ్చాడు. ఇదిలా ఉంటే ప్రాబబుల్స్‌లో చోటు దక్కని సెహ్వాగ్‌, హర్భజన్‌లను సెలక్టర్లు పట్టించుకోలేదు. ప్రాబబుల్స్‌లో లేకున్నా…. ఎంపిక చేస్తారని భావించినప్పటకీ… ఐపీఎల్‌లో వీరిద్దరి ప్రదర్శనా