గడువులోగా గ్రీనరీ సంబంద పనులు పూర్తి చేయాలి

– బల్దియా కమిషనర్ ప్రావీణ్య
 -ఉద్యాన విభాగ ఆధికారుల తో సమీక్ష..
వరంగల్ ఈస్ట్, జూలై 29 (జనం సాక్షి)
     నిర్దిష్ట గడువులోగా  గ్రీనరీ సంబంద పనులు పూర్తి చేయాలని బల్దియా కమిషనర్ పి. ప్రావీణ్య హార్టికల్చర్ అధికారులను ఆదేశించారు.శుక్రవారం బల్దియా ప్రధాన కార్యాలయం లో ఉద్యాన విభాగ ఆధికారుల తో సమీక్ష సమావేశం నిర్వహించి సమర్థవంతం గా నిర్వహించుటకు తగు సూచనలు చేశారు.ఈ సందర్భంగా కమీషనర్ మాట్లాడుతూ బల్దియా వ్యాప్తంగా 66 డివిజన్ లలో హరితహారం లో భాగంగా విరివిగా మొక్కలు నాటేలా చర్యలు తీసుకోవాలని, నాటిన మొక్కల సమాచారం అందుబాటు లో ఉండాలని,నర్సరీ లలో పెంచబడుతున్న మొక్కల సంఖ్య పై అవగాహన కలిగి ఉండాలని, హరిత హారం కార్యక్రమంలో భాగంగా పంపిణీ చేసే మొక్కలు,గతం లో నాటిన మొక్కల సంరక్షణ వాటికి నీటి అందజేత,ట్రీ గార్డ్ ల ఏర్పాటు, నగరం మొత్తం పచ్చదనం గా మార్చడానికి యుద్ధ ప్రాతిపాదికన చర్యలు చేపట్టాలని,నర్సరీ లలో మొక్కలను అందజేసిన తర్వాత వాటిని శుభ్రపరిచి సీజనల్ మొక్కలను పెంచేలా ప్రణాళిక బద్దం గా కార్యాచరణ సిద్ధం చేసుకోవాలని తెలిపారు. ప్రస్తుతం కొనసాగుతున్న పనులైన సెంట్రల్ మీడియన్ , ఎవెన్యూ ప్లాంటేషన్, గ్యాప్ ఫిల్లింగ్ పనులు తదితర  పనులను వేగం గా పూర్తిచేసిన తదుపరి కొత్త గ్రీనరీ పనులను చేపట్టాలని కమీషనర్ ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో  అదనపు కమిషనర్ అనిసుర్ రషీద్, సి.హెచ్.ఓ. శ్రీనివాసరావు,హెచ్.ఓ.ప్రెసిల్లా తదితరులు పాల్గొన్నారు.
Attachments area