గణాంక అధికారిగా కృష్ణారావు

శ్రీకాకుళం, జూలై 12 : ముఖ్య ప్రణాళిక అధికారి కార్యాలయంలో పనిచేస్తున్న బి.కృష్ణారావుకు పదోన్నతి లభించింది. 8 ఏళ్లుగా ఉప గణాంక అధికారిగా పని చేస్తున్న ఆయనను గణాంక అధికారిగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇక్కడ గణాంక అధికారిగా పనిచేసిన ఎ.ఆనందరావుకు అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పదోన్నతి కల్పిస్తూ విజయనగరం సిపిఓ కార్యాలయానికి బదిలీ చేశారు. దీంతో ఇక్కడ ఖాళీ ఏర్పడిన గణాంక అధికారి స్థానంలో కృష్ణారావును నియమించారు.