గద్దర్ మరణం తీరని లోటు

జనంసాక్షి, కమాన్ పూర్ :ప్రజాయుద్ధ నౌక గద్దర్ సంతాప సభ కమాన్ పూర్ గ్రామములో మండల కాంగ్రెస్ ఎస్సీ సెల్ విభాగం ఆధ్వర్యంలో స్థానిక బస్టాండ్ వద్ద నిర్వహించడం జరిగింది.ప్రజా గాయకుడు, తెలంగాణ ఉద్యమ నేత గద్దర్ గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ ఇటీవల హైదరాబాదులో అపోల ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందగా గద్దర్ ఆకాల మృతికి సంతాపం తెలియజేస్తూ కమాన్ పూర్ మండల కేంద్రంలో అంబేద్కర్ విగ్రహం ముందు కాంగ్రెస్ పార్టీ మండల ఎస్సీ సెల్ విభాగం అధ్యక్షుడు మల్యాల తిరుపతి, సీనియర్ నాయకులు దాసరి గట్టయ్య అధ్వర్యంలో ప్రజా గాయకుడు గద్దర్ సంతాప సభ నిర్వహించడం జరిగింది.
ముందుగా గద్దర్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు.ప్రముఖ కవి, ప్రజా గాయకులు
గద్దర్ గా పేరొందిన విఠల్ కవిగా, గాయకుడిగా ఆట, పాటలతో లక్షలాది మంది అభిమానాన్ని సంపాదించుకున్నారని, ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చిన గొప్ప వ్యక్తి అని కాంగ్రెస్ నాయకులు పేర్కొన్నారు. గద్దర్ అకాల మరణం తెలంగాణ సమాజానికి తీరని లోటని, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం, సానుభూతి తెలిపారు. ప్రజా గొంతుక మూగబోయిందని కాంగ్రెస్ నాయకులు అన్నారు.ఈ కార్యక్రమంలో మండల మాజీ ఎంపీపీ ,కరీoనగర్ రైస్ మిల్లర్ల సంఘం మాజి అద్యక్షుడు కోలేటి మారుతి, కమాన్ పూర్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు వైనల రాజు,జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శులు గాండ్ల మోహన్ రంగు సత్యనారాయణ గౌడ్,సీనియర్ నాయకులు మల్యాల రాంచదర్ గౌడ్,జిల్లా కాంగ్రెస్ కార్యదర్శి భూoపెళ్లి రాజయ్య, గుoడారం సర్పంచ్ ఆకుల ఓదెలు, మైనార్టీ మండల అధ్యక్షుడు ఎండీ అఫ్సర్, బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు నల్లవెల్లి శంకర్ ,యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు జెమిని గౌడ్,మండల ప్రధాన కార్యదర్శి ఒడ్నాల శ్రీనివాస్,ఉపాధ్యక్షుడు బద్రపు శంకర్,మాజి కో ఆప్షన్ లు ముస్తక్,అబ్దుల్ రఫీక్,వార్డు మెంబర్ పోతుల కుమార్,పెండ్యాల రాజు,గ్రామ శాఖ అధ్యక్షులు పిడుగు శంకర్ కోoతం శ్రీనివాస్,సీనియర్ నాయకులు చోపరి తిరుపతి, చోప్పరి షేకర్,కుక్క రవి,నగునురి నర్సయ్య, బొజ్జ సతీష్,చాట్లా రాయమల్లు,పిడుగు నర్సయ్య ,ఈదునురి ఎల్లయ్య,ఈరుగురాల రాజు, యూసుఫ్ లల్లు, ఆరెళ్ళి శ్రీనివాస్, చిప్పకుర్తి కనకయ్య,శ్రీనివాస్ మామిడి రాజు తదితరులు పాల్గొన్నారు.

తాజావార్తలు