గయాలో పెట్రోల్‌ బావి

1

– ఫ్రీ చమురు కోసం క్యూ కట్టిన జనం

గయా,ఆగస్టు 21(జనంసాక్షి):టైటిల్‌ చూడగానే.. ఇదేంటి నీళ్ల కోసం బిందెలెత్తుకుని మరీ పోటీపడటం చూశాం.. క్యూలో నిల్చుని నేనంటే నేను అని కొట్టుకున్న వారిని చూశాం పెట్రోలు కోసం బిందెలతో పోటీపడడమేంటని ఆశ్చర్యంగా ఉంది కదూ.! అవును విూరు వింటున్నది నిజమే.. పెట్రోలు కోసం జనాలంతా పోటీ పడ్డారు. బిందెలు, బకెట్లు, పెద్ద పెద్ద డబ్బాలతో బావి దగ్గర క్యూ కట్టారు. ఇదంతా మన పొరుగు రాష్ట్రమైన బిహార్‌లోని గయాలో జరిగింది.బిహార్‌లో ఓ పాతబావిలో నీళ్ల కోసం బక్కెన వేస్తే నీళ్లు కాదు ఏకంగా పెట్రోల్‌ లాంటి చమురు వచ్చింది. దీంతో అనుమానం వచ్చిన స్థానికులు పాడుపడిన బావి కదా చాలా రోజుల్నుంచి నీళ్ల కూడా తోడ లేదు అందుకే నీళ్లు ఇలా ఉంటాయేమో అని మరోసారి తోడారు. మళ్లీ సేమ్‌ సీన్‌ రిపీట్‌ అవ్వడంతో ఇది నిజంగా పెట్రోల్‌ అని ఊరు ఊరంతా బిందెలు, బకెట్లు, డబ్బాలతో బావి దగ్గరికి క్యూ కట్టారు. విషయం తెలుసుకున్న పక్క గ్రామస్థులు కూడా బావి వద్దకు చేరుకున్నారు. పోటీ పడి మరీ బకెట్లతో ఆయిల్‌ తోడుకున్నారు.ఈ విషయం ఆ నోటా ఈ నోటా పడి చివరికి పోలీసుల చెవిన పడింది. పెద్ద ఎత్తున పోలీసులు బావి దగ్గరికి చేరుకుని స్వాధీనం చేసుకున్నారు. బావి దగ్గరికి ఎవరూ రాకూడదని ఆంక్షలు విధించారు. దీంతో గ్రామస్థులు కాస్త వెనకడుగేసి బావి దగ్గర్నుంచి వెళ్లిపోయారు. ఇది పెట్రోలా.. కాదా అని నిర్ధారించడానికి త్వరలో ప్రభుత్వం తరపున నిపుణులు, అధికారులు రానున్నారని పోలీసు అధికారి తెలిపారు. అయితే బిహార్‌లో బావిలో నీళ్లకు బదులు చమురు లభించడం ఇదే మొదటి సారి అని స్థానికులు చెబుతున్నారు. ఈ ఆయిల్‌ను అన్ని రకాలుగా టెస్ట్‌ చేశాం.. ఖాళీ సంచిపైన ఈ ఆయిల్‌ పోసి మంట మండిస్తే పెద్ద ఎత్తున అగ్గి రాజుకుంటుందోని మరి కొందరు గ్రామస్థులు చెప్పారు. దీనిపై క్లారిటీ రావాలంటే అధికారులు పరిశీలించిందాకా వేచి చూడాల్సిందే మరి.!