గర్భిణీ స్త్రీలకు టీకాలు తప్పనిసరి

మెడికల్ ఆఫీసర్ డాక్టర్ మాలకొండయ్య
రాజోలి జులై 27(జనంసాక్షి)
గర్భిణీ స్త్రీలకు,శిశువులకు వ్యాది నిరోధక టీకాలు తప్పకుండా వేయించుకోవాలి అని రాజోలి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మెడికల్ ఆఫీసర్ డాక్టర్ మాలకొండయ్య చెప్పారు. రాజోలి మండల కేంద్రము పరిధిలోని పెద్ద తాండ్ర పాడ్ గ్రామం లోని ఆరోగ్య కేంద్రం ను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఏ ఎన్ ఎమ్ ల, ఆశా కార్యకర్తల రిజిష్టర్ లను రికార్డు లను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు, ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతీ బుదవారం సబ్ సెంటర్ లోనూ, ప్రతి శనివారం వారికి కేటాయించిన గ్రామాలలోను వైద్య ఆరోగ్య సిబ్బంది వ్యాధి నిరోధక టీకాలు వేస్తారని ఆయన మాట్లాడుతూ తెలిపారు, గ్రామాలలో ఉన్న గర్భిణీ స్త్రీలు, శిశువులు తప్పకుండా వ్యాధి నిరోధక టీకాలు వేయించుకోవాలని ఆయన అన్నారు. అలాగే ఆశా వర్కర్లు ప్రతి ఇంటికి వెళ్లి గర్భిణీ మహిళలను, శిశువులను టీకా కేంద్రం నకు తరలించి టీకాలు వేయించాలి అని ఆయన సూచించారు. అలాగే గర్భిణీ స్త్రీలు కాన్పు ఇంటి దగ్గర కాకుండా రాజోలి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కాన్పు కావాలన్నారు, తల్లీ బిడ్డా క్షేమంగా ఆరోగ్యంగా ఉంటారని ఆయన అన్నారు, పురిటి నొప్పుల వచ్చిన వెంటనే తమ సిబ్బందికి చెబితే 108 అంబులెన్స్ ను మీ ఇంటికి వచ్చి మిమ్ములను ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నకు తీసుకోని వస్తారని కాన్పు అయిన తరువాత అదే వాహనం లో మిమ్ములను క్షేమంగా తిరిగి ఇంటికి చేరుస్తారు అని ఆయన అన్నారు.ప్రభుత్వ ఆసుపత్రిలో కాన్పు సమయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము కే సి ఆర్ కిట్ తో పాటు ఆర్థిక సహాయం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఇస్తుందని ఆయన మాట్లాడుతూ తెలిపారు. ఏ ఎన్ ఎమ్ లకు కేటాయించిన కాన్పు కేసు లను ప్రతి నెల రాజోలి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లోనే కాన్పులు చేయించాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో టిబి సూపర్ వైజర్ జయప్రకాశ్, హెల్త్ అసిస్టెంట్ రంజిత్ కుమార్, హెల్త్ సూపర్ వైజర్ హెలెన్, ఏ ఎన్ ఎమ్ లు శ్రీదేవి,శిరీష ఆశా వర్కర్లు రంగమ్మ, సునందమ్మ, రాజేశ్వరి, నిర్మల తదితరులు పాల్గొన్నారు