గవర్నర్లే కాంగ్రెస్‌ను ఓడిస్తున్నారు

దిగ్విజయ్‌ సంచలన ఆరోపణలు
న్యూఢిల్లీ,మే19( జ‌నం సాక్షి): ఇంతకాలం అంటే గతన ఆనలుగేళ్లుగా కాంగ్రెస్‌ను ఓడిస్తూ వచ్చింది గవర్నర్లే నని  ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం నియమించిన గవర్నర్లపై కాంగ్రెస్‌ సీనియర్‌ నేత దిగ్విజయ్‌ సింగ్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్‌ ‘ఓడిపోతున్నది’ ప్రజల చేతుల్లో కాదనీ… ప్రధాని నియమించిన గవర్నర్ల చేతుల్లో మాత్రమేనని అన్నారు. కాంగ్రెస్‌ ఓటమికి వారే కారణమవుతున్నారని ఆయన ఆరోపించారు. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ వరుస పరాజయాలు మూటగట్టుకోవడంపై దిగ్విజయ్‌ స్పందిస్తూ.. ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఓడిపోవడం లేదు. ప్రధానమంత్రి (నరేంద్రమోదీ) నియమించిన గవర్నర్లే పార్టీ ఓటమికి కారణమవుతున్నారు..అని పేర్కొన్నారు. గోవా, మిజోరాం, మణిపూర్‌, బీహార్‌ రాష్టాల్రతో పాటు తాజాగా జరిగిన కర్ణాటక ఎన్నికలే దీనికి నిదర్శనమన్నారు. కర్ణాటకలో మాదిరిగా ఈ రాష్టాల్లో ప్రభుత్వ ఏర్పాటు కోసం అతిపెద్ద పార్టీలను ఎందుకు ఆహ్వానించలేదని దిగ్విజయ్‌ సింగ్‌ ప్రశ్నించారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అతిపెద్ద పార్టీలనే ఆహ్వానించాల్సివస్తే బీహార్‌, గోవా రాష్టాల్లో అలా ఎందుకు జరగలేదు? ఇలాంటి నిర్ణయాలే కాంగ్రెస్‌ను దెబ్బతీస్తున్నాయి…’ అని విమర్శించారు.