గాంధారి మండలం చద్మల్ గ్రామంలో నూతన విద్య కమిటీ ఏకగ్రీవం
మండలంలోని చద్మల్ గ్రామ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థుల తల్లిదండ్రులు మరియు పాఠశాల విద్య కమిటీ సభ్యుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా పాఠశాల నూతన విద్య కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు అధ్యక్షుడిగా జి సాయిలు ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు ఈ సందర్భంగా సమావేశంలో పలు అంశాలపై తీర్మానాలు ఆమోదించారు
పాఠశాలకు స్కోవెంజర్ ను 2౦౦౦ రూపాయలు గ్రామ పంచాయితీ నుండి ఇపించాలని మరియు పాఠశాలకు విద్యా వాలేంటర్ కు 3౦౦౦ రూపాయలు పాఠశాల విధ్యార్తుల తల్లి దండ్రులు అందరూకలసిడబ్బులు జమ చెసి ఇస్తామని నిర్ణయం తీసుకున్నారు
ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ సంగరావు,పంచాయతీ కార్యదర్శి సాయిరెడ్డి,ఉపాధ్యాయులు సౌజన్య,
పాఠశాల విద్య కమిటీ సభ్యులు విద్యార్థులు తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు