గాంధీ కుటుంబం పై కేంద్ర ప్రభుత్వ వైఖరి పట్ల ఆందోళన;డిసిసి ఉపాధ్యక్షులు పారా సీతయ్య

కోదాడ టౌన్ జూలై 21 ( జనంసాక్షి )
కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వం గాంధీ కుటుంబం పై కక్ష సాధింపు చర్యలు మానుకోవాలని డిసిసి ఉపాధ్యక్షులు పార సీతయ్య అన్నారు.
గురువారం పట్టణంలోని రాజీవ్ గాంధీ చౌరస్తాలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు కోదాడ కాంగ్రెస్ పార్టీ నాయకులు రోడ్డుపై పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారతదేశానికి కుటుంబాన్ని త్యాగం చేసిన గాంధీ కుటుంబం పై కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వం రాజకీయ కక్ష సాధింపు చర్యలకు దిగడం ప్రజాస్వామికమని అన్నారు.రోజురోజుకు జీఎస్టీ పేరిట సామాన్యుల నడ్డి విరుస్తున్న కేంద్ర ప్రభుత్వం వారి సమస్యలను గాలికి వదిలేసి గాంధీ కుటుంబంపై బురద చల్లడానికి రాజకీయ ప్రతీకారంలో భాగంగానే  దర్యాప సంస్థలను వాడుకుంటున్నారని ఆరోపించారు.
ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు మానుకోకపోతే రానున్న రోజుల్లో తగిన మూల్యం చెల్లించుకోవలసి వస్తుందన్నారు.ఈ కార్యక్రమంలో పిసిసి రాష్ట్ర కార్యదర్శిలు ఆవు దొడ్డి ధనమూర్తి,చింతలపాటి
శ్రీనివాసరావు,మున్సిపల్ ఫ్లోర్ లీడర్ కందుల కోటేశ్వరరావు, కౌన్సిలర్లు షాబుద్దీన్,నిరంజన్ రెడ్డి,గంధం యాదగిరి,కంపాటి శ్రీను,టౌన్ సెక్రటరీ పాలూరి సత్యనారాయణ,వర్కింగ్ ప్రెసిడెంట్ బాల్ రెడ్డి,ఉపాధ్యక్షులు బాగ్దాద్,మాతంగి బసవయ్య, ధావల్,పాశం శ్రీను,వీరారెడ్డి,సైది బాబు,షమీ,ఖాజా గౌడ్,యాకూబ్,గురవయ్య,బాజన్,బాబు,దాసు,గోపి,
శేఖర్,కంబాల ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.