గాయత్రి అమ్మవారికి గాజుల అలంకరణతో ప్రత్యేక పూజలు
పినపాక నియోజకవర్గం ఆగస్టు 26 (జనం సాక్షి): మణుగూరు మండలం గుట్టమల్లారం శ్రీ పంచముఖ వేద గాయత్రి అమ్మవారికి గాజుల అలంకరణతో వైభవంగా పూజా కార్యక్రమాలను ఆలయ అర్చకులు దయానిది అక్కినేపల్లి వసంతాచార్యులు శ్రావణమాసం ఆఖరి శుక్రవారం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ. శ్రావణమాసం అంటేనే శుభ మాసం దీనినే సభో మాసం అని కూడా అంటారు. శ్రావణమాసంలో లక్ష్మీదేవిని పూజించడం వల్ల ఆ దేవి చాలా సంతృప్తి చెంది వివాహితులు పూజ చేసుకోవడం తో సౌభాగ్యవంతులుగా వర్ధిల్లుతారు. లక్ష్మీ అనగానే కొందరు ధనం మాత్రమే అనుకుంటారు. ధనం, ధైర్యం, విద్య ,ధాన్యం, విజయం, పరపతి ,సంతానం, గుణం ,మనకి ప్రాప్తి కలగాలని ఆ తల్లిని ఈ మాసంలో పూజిస్తారు శ్రావణమాసంలో కొత్త పెళ్లికూతురులతో అత్తలు ఈ వ్రతం చేయిస్తే శుభం కలుగుతుంది అలా చేయడంవల్ల సకల సంపదలు సుఖసంతోషాలు కలుగుతాయని ప్రతితీ. ఈ వ్రత కథలో చారుమతి అనే స్త్రీ అందరితో అనుకువగా ఉంటుందని అత్తమామలను చక్కగా చూసుకుంటుందని అలాంటి స్త్రీకి లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుందని చెబుతారు. శ్రావణమాసం లో చేసే పూజలకు పత్యేకత ఉంటుందని ఆలయ అర్చకులు తెలిపారు. పూజా కార్యక్రమంలో అధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు.