గాలికి బెయిల్‌

1A

నాలుగేళ్ల తర్వాత బందీఖానా నుంచి విముక్తి

దిల్లీ,జనవరి20(జనంసాక్షి): దాదాపు మూడున్నరేళ్లుగా జైలుకే పరిమితమైన గాలి జనార్ధన్‌ రెడ్డికి ఎట్టకేలకు ఊరట లభించింది. ఓఎంసీ కేసులో గాలి జనార్దన్‌రెడ్డికి సుప్రీంకోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. బెయిల్‌ మంజూరు చేస్తే అభ్యంతరం లేదని సీబీఐ పేర్కొనడంతో సుప్రీంకోర్టు గాలి జనార్దన్‌రెడ్డికి బెయిల్‌ మంజూరు చేసింది.  ఓఎంసీ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న గాలి జనార్దన్‌ రెడ్డికి సుప్రీం తీర్పుతో ఎట్టకేలకు ఊరట లభించింది.  సుప్రీంకోర్టు ఆయనకు మంగళవారం బెయిల్‌ మంజూరు చేసింది.  బెయిల్‌ మంజూరుకు సీబీఐ అభ్యంతరం తెలపకపోవటంతో న్యాయస్థానం బెయిల్‌ ఇచ్చింది.  ఒంఎసీ కేసులో 2011 సెప్టెంబర్‌ 4న జనార్దన్‌ రెడ్డిని సీబీఐ అరెస్ట్‌ చేసిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఆయన జైల్లోనే ఉన్నారు.   ఏడు కేసుల్లోనూ గాలి జనార్దన్‌ రెడ్డికి బెయిల్‌ మంజూరు కావటంతో త్వరలో  జైలు నుంచి విడుదల కానున్నారు.  ప్రస్తుతం ఆయన బెంగళూరులోని పరప్పన అగ్రహార జైల్లో ఉన్నారు. సుమారు నాలుగు సంవత్సరాల తర్వాత గాలికి బెయిల్‌ మంజూరైంది. అయితే షరతులతో కూడిన బెయిల్‌ను కోర్టు మంజూరు చేసింది. రూ. 30 లక్షల పూచీకత్తు సమర్పించాలని గాలికి కోర్టు ఆదేశించింది. బళ్లారి వెళ్లకూడదని, పాస్‌పోర్టు అప్పగించాలని ఆదేశాలు జారీ చేసింది. మొత్తం ఏడు కేసుల్లో బెయిల్‌ లభించడంతో గాలి ఇక బయటకు రానున్నారు. గాలి ప్రస్తుతం బెంగళూరులోని పరప్పన అగ్రహార జైలులో ఉన్నారు. ఓఎంసీ కేసులో గాలి గత కొంత కాలం నుంచి జైలు జీవితం గడుపుతున్న విషయం తెలిసిందే. గాలికి బెయిల్‌ మంజూరైన నేపథ్యంలో ఆయన అనుచరులు, అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అనేక మలుపులు తిరిగిన ఈ కేసులో ఆయన అనేకసార్లు బెయిల్‌ కోసం దరఖాస్తు చేసి భంగపడ్డారు. ఓ దశలో బెయిల్‌ కోసం జడ్జిని మేజేజ్‌ చేశారన్న ఆరోపణలు కూడా వచ్చాయి.