గిట్టుబాటు ధర కల్పించడంలో కేంద్ర ప్రభుత్వం విఫలం

మునగాల, అక్టోబర్23(జనంసాక్షి): రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో కేంద్ర ప్రభుత్వం విఫలం అయిందని, రైతులకు ఎరువులు విత్తనాలు ఉచితంగా ఇవ్వాలని రైతంగం పట్ల సవతి తల్లి ప్రేమ చూపుతున్నాయని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి అన్నారు. ఆదివారం మండల కేంద్రంలో జరిగిన జిల్లా రైతు సంఘం ద్వితీయ మహాసభలో ఆయన మాట్లాడుతూ… స్వామినాథన్ కమిషన్ అమలు చేయాలన్నారు. రైతు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయి అని దీంతో రైతులు ప్రైవేటు వడ్డీ వ్యాపార దగ్గర అప్పు తెచ్చి పంట పెట్టుబడి పెడితే గిట్టుబాటు ధర రాక తెచ్చిన అప్పులకు వడ్డీ కట్టలేని స్థితిలో రైతులు ఉన్నారని వారు తెలిపారు. రైతుల పాత రుణాలు వెంటనే రద్దు చేయాలని అన్నారు. యాసాంగిలో రైతులు పండించిన పంటలను ఐకెపి ధార కొనుగోలు చేసి గిట్టుబాటు ధర కల్పించాలన్నారు. ఒక వైపున కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అంబానీ అదానీలకు మాత్రం రాయితీలు ఇచ్చి రైతులకు మాత్రం ఎరువులు కానీ మిగతా సబ్సిడీలు ఇవ్వడం మొత్తం మానేశారని ఈ మధ్యకాలంలో కేంద్ర ప్రభుత్వం రైతుల స్టార్టర్లకుమీటర్లు పెడతామని ప్రచారం చేస్తూ రైతుల్ని ఆందోళనకు గురిచేస్తుందని, వెంటనే కేంద్ర ప్రభుత్వం ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని, లేనియెడల రైతు సంఘం ఆధ్వర్యంలో రైతులను సమీకరించి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు ఉదృతం చేస్తామని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి టి సాగర్, రాష్ట్ర ఉపాధ్యక్షులు మల్లు నాగార్జున రెడ్డి, రైతు సంఘం జిల్లా అధ్యక్షులు బుర్రి శ్రీరాములు, జిల్లా కార్యదర్శి దండ వెంకట్ రెడ్డి, రాష్ట్ర కమిటీ సభ్యులు కొప్పుల రజిత, జిల్లా కమిటీ సభ్యులు మేదరమెట్ల వెంకటేశ్వరరావు, దేవరం వెంకటరెడ్డి, స్టాలిన్ రెడ్డి, షేక్ సైదా, బెల్లంకొండ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.